వెంకటేష్, నాగచైతన్య హీరోలుగా తెరకెక్కుతున్న మల్టీస్టారర్ సినిమా వెంకిమామ. ఈ సినిమాలో రియల్ లైఫ్‌లో కూడా మేనల్లుడు అయిన నాగ చైతన్యతో కలిసి ఈ సినిమా చేస్తున్నాడు.జైలవకుశ సినిమా తరువాత డైరెక్టర్ బాబీ ఈ కథపై చాలా వర్క్ చేసి వెంకీమామ సినిమా స్టార్ట్ చేసాడు. ఈ సినిమాను మొదట నవంబర్ లేదా డిసెంబర్ లో రిలీజ్ చేయాలని అనుకున్నారు. తరువాత సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయాలని అనుకున్న సంగతి తెలిసిందే. 2019లో సంక్రాంతి  వచ్చిన F2 హిలేరియస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్.


సంక్రాంతి పండుగ రోజున రిలీజ్ చేయాలని ముందుగా ఫిక్స్ అయ్యారు. జనవరి 14 న రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ, సినిమా జనవరి 11 వ తేదీన రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారని సమాచారం. అయితే ఈ డేట్ ను అధికారికంగా ప్రకటించాల్సివుంది. ఇక ఇప్పుడు చేస్తున్న వెంకీమామ కూడా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనే అంటున్నారు. వెంకటేష్ కామెడీ ఎంతబాగా చేస్తాడో ఎమోషన్‌ని కూడా అదే రేంజ్‌లో పండిస్తాడు. కాబట్టి ఈ సినిమా ఖచ్చితంగా ఒక మంచి సినిమా అయ్యే అవకాశాలున్నాయి. 


 జనవరి 10 వ తేదీన రజినీకాంత్ దర్బార్ రిలీజ్ కాబోతున్నది. ఈ మూవీ రిలీజైన మరుసటి రోజున వెంకిమామ, ఆ మరుసటి రోజున మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరూ, అల్లు అర్జున్ అల వైకుంఠపురంలో సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. మరి సంక్రాంతి బరిలో నిలిచే సినిమాల్లో ఏ సినిమాలు హిట్ అవుతాయో.. ఏవి ఫట్ అంటాయో చూడాలి.వెంకటేష్ వెంటనే ఈ నగరానికి ఏమైంది? సినిమా డైరెక్టర్‌తో సినిమా చేయనున్నాడు. ఈ సినిమాని కూడా సురేష్ బాబే ప్రొడ్యూస్ చెయ్యబోతున్నారు. నిజజీవితంలో జరిగిన ఇన్సిడెంట్స్ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కబోతుంది. ఎక్కవ భాగం షూటింగ్ హైదరాబాద్‌లోనే ప్లాన్ చేస్తున్నారట. మరి ఈ సినిమాతో వెంకీమామ మరొక‌సారి గుండెలు పిండెయ్యడానికి రెడీ అయ్యాడన్నమాట.  


అయితే ఎప్పటికప్పుడు కొత్తగా ఉండే కథలు టేకప్ చెయ్యడానికి ఇష్టపడే వెంకటేష్ మళ్ళీ పూర్తిగా ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాలు చెయ్యడానికి ఇష్టపడట్లేదు. అందుకే వెంకీమామ సినిమా తరువాత మళ్ళీ ఒక యాక్షన్ ఎంటర్టైనర్ చెయ్యబోతున్నాడు. గతంలో నేను లోకల్, హలో గురు ప్రేమకోసమే లాంటి హిట్స్ అందించిన నక్కిన త్రినాథరావు డైరెక్షన్‌లో తన నెక్స్ట్ సినిమా చెయ్యబోతున్నాడు వెంకటేష్. ఆ సినిమాలో తనకు బాగా సూట్ అయ్యే, అచొచ్చిన పోలీస్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఆ సినిమాలో యాక్షన్ సీక్వెన్సెస్‌కి ప్రాధాన్యత ఉంటుంది అంటున్నారు. ఈ సినిమా కూడా సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సురేష్ బాబు నిర్మిస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: