మెగా ఫ్యామిలీ నుంచి టాలివుడ్ కి హీరోగా  ఏంట్రీ ఇచ్చిన సాయి ధరమ్ తేజ్... సుప్రీం హీరో గా  టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించుకున్నాడు. చిరంజీవి ని అమితంగా అభిమానించే సుప్రీం హీరో సాయి ధరంతేజ్... ఆయన  సినిమాల్లో  చిరంజీవి హిట్ సాంగ్స్ రీమేక్ చేస్తూ అభిమానులను అలరిస్తుంటాడు . కాగా  సాయి ధరమ్ తేజ్ నేడు 33 వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. దీంతో సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కి బర్త్ డే  విషెస్ వెల్లువెతున్నాయి . కుటుంబ సభ్యులు అభిమానులు, నటులు  సాయి ధరమ్ తేజ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే కొంతమంది హీరోలు సినిమాల్లోనే కాకుండా నిజ జీవితంలోనూ హీరో అనిపించుకుంటారు . సమాజంలో ఏదో ఒక మంచి పని చేస్తూ నిజమైన హీరోలుగా  మారుతుంటారు. ఇప్పుడు సాయి ధరమ్ తేజ్ తీసుకున్న నిర్ణయంతో నిజమైన   హీరోగా మారిపోయాడు ఆయన . 

 

 

 

 

 నేడు తన పుట్టిన రోజు సందర్భంగా సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ ఓ కీలక నిర్ణయం ప్రకటించారు. తన పుట్టిన రోజు సందర్భంగా వృద్ధాశ్రమాన్ని నిర్మాణం పూర్తి చేసే బాధ్యతను స్వీకరిస్తున్నట్లు సాయి ధరమ్ తేజ్ తెలిపాడు . నిర్మాణం జరుగుతున్న వృద్ధాశ్రమాన్ని పూర్తి చేయడంతో పాటు ఒక సంవత్సరం పాటు వృద్ధాశ్రమం  నిర్వహణకు అయ్యే ఖర్చు మొత్తం తానే భరిస్తున్నట్టు వెల్లడించారూ . అయితే వృద్ధాశ్రమం వాళ్ళు తనను  సోషల్ మీడియాలో టాగ్  చేసి  వృద్ధాశ్రమం కోసం ఆర్థికంగా సహకరించాలని కోరారని... దీంట్లో వృద్ధాశ్రమానికి శాశ్వత పరిష్కారం చూపాలనే  ఉద్దేశంతో... తన పుట్టినరోజు నాడు ఈ నిర్ణయం తీసుకున్నానని సాయిధరమ్ తేజ్  తెలుపారు . 

 

 

 

 

 వృద్ధాశ్రమం నిర్మాణం మధ్యలో నిలిచిపోవడంతో దాన్ని పూర్తి చేసి సంవత్సరం పాటు వృద్ధాశ్రమ నిర్వహణకు అయ్యే ఖర్చులు మొత్తం భరిస్తానన్న  సాయి ధరమ్ తేజ్... బర్త్ డే సందర్భంగా ఫాన్స్ ఎవరు వేడుకలు చేయకుండా ఆ డబ్బులు తనకు పంపిస్తే వృద్ధాశ్రమం అభివృద్ధి కోసం ఉపయోగిస్తానని తన  ఫాన్స్ ని కోరాడు. తమ అభిమాన నటుడు అడగటంతో సాయిధరమ్ తేజ్ అభిమానులు  ఇప్పటికే లక్ష రూపాయల వరకు డబ్బు పంపారట. దీంతో అభిమానుల నుంచి సహకారం అందటం  పట్ల సంతోషం వ్యక్తం చేశారు సాయి ధరమ్ తేజ్. అయితే ఈ విషయం గొప్పలు చెప్పుకోవడానికి చెప్పటం లేదని తనను చూసి మరొకరు ముందుకు వస్తారని ఉద్దేశంతోనే ఈ విషయం బయటకు వెల్లడిస్తారని సాయి ధరమ్ తేజ్ చెప్పారు.ఏదేమైనా ఈ నిర్ణయం తో నిజమైన హీరోగా మారాడు సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్.

మరింత సమాచారం తెలుసుకోండి: