తెలుగు లో వస్తున్న జబర్ధస్త్ కామెడీ షో ద్వారా ఎంతో మంది నటులు పరిచయం అవుతున్నారు.  జబర్ధస్త్  లో పాపులారిటీ సంపాదించిన వారు వెండి తెరపై తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.  ఈ నేపథ్యంలో వేణు, ధన్ రాజ్, చమ్మక్ చంద్ర, తాగుబోతు రమేష్ లాంటి వారు వస్తున్నారు.  ఈ మద్య మరికొంత మంది కమెడియన్లు కూడా తెలుగు తెరపై సందడి చేస్తున్నారు.  జబర్ధస్త్  సుడిగాలి సుధీర్ బ్యాచ్ సీన్లోకి దిగారంటే కడుపుబ్బా నవ్వాల్సిందే.  సుడిగాలి సుధీర్, గెటప్ శీను, ఆటో రాంప్రసాద్, సన్నీ వీరి కాంబినేషన్ లో ఎన్నో కామెడీ స్కిట్స్ వచ్చాయి.

ఈ మద్య సుడిగాలి సుధీర్ హీరోగా మారిన విషయం తెలిసిందే. ఇక గెటప్ శీను సైతం కొన్ని సినిమాల్లో మంచి పాత్రలు దక్కించుకుంటున్నాడు. ఇటీవల పూరి దర్శకత్వంలో రామ్ నటించిన ‘ఇస్మార్ట్ శంకర్’ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన గత అనుభవాలను పంచుకున్నాడు. తెరపై ఎంత కలర్‌ఫుల్‌గా ఉంటుందో.. తెర వెనకాల అంతే పెయిన్ ఫుల్‌గా ఉంటుందని అన్నారు.  ఈ స్థాయికి రావడానికి ఎన్నో కష్టాలు పడ్డానని మనిషికి గుర్తిపు అంత సులభంగా రాదని అన్నారు. 

సినిమాల్లోకి రాకముందు టీవీ9, టీవీ1, జెమిని మ్యూజిక్, మా కేబుల్, సీ ఛానెల్, హై మ్యూజిక్, వనిత టీవీల్లో పనిచేశానని తెలిపాడు. కెరీర్ బిగినింగ్ లో అవకాశాల కోసం ఓ అసోసియేట్ డైరెక్టర్‌కి ఫోన్ కాల్ చేశానని.. ఐతే అతడు బండ బూతులు తిట్టాడని తెలిపాడు శ్రీను. ఇంకోసారి తనకు ఫోన్ చేయద్దని, అతడు చివాట్లు పెట్టాడని వెల్లడించాడు.  కేవలం ఫోన్ చేసినందుకే ఇంత ఘోరంగా తిడతారా అని ఆరోజు అంతా బాధపడ్డానని అన్నారు. ఇలాంటి అవమానులు ఎన్నో తన కెరీర్ ఆరంభంలో ఎదురయ్యాయని గెటప్ శ్రీను వివరించాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: