తమిళ చిత్ర పరిశ్రమ సూపర్ స్టార్స్ రజనీకాంత్, కమల్ హాసన్ లతో సినిమాలు చేయాలంటే భారీ బడ్జెట్ కావాల్సిందే. సినిమాలు బాగా ఆడకపోయినా కలెక్షన్లు మాత్రం బాగా వస్తాయి. కానీ తమిళ చిత్ర పరిశ్రమలో బ్యాంకబుల్ హీరోలు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం విజయ్ మాత్రమే అని ప్రముఖ తమిళ నిర్మాత అర్చన కళాపది. విజయ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘బిగిల్’ సినిమాకు అర్చన నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. దాదాపు రూ.180 కోట్ల రూపాయలతో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా అర్చన.. విజయ్‌పై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఎవరైనా రూ.180 కోట్లు ఖర్చు పెట్టాలంటే చాలా ఆలోచించాలని.,, సినిమాలో విజయ్ నటిస్తున్నాడు కాబట్టే అంత డబ్బు వెచ్చించానని., విజయ్ కాకుండా మరో హీరో నటించి ఉంటే మాత్రం అంత డబ్బు పెట్టేదాన్ని కానని., తమిళ చిత్ర పరిశ్రమలో మోస్ట్ బ్యాంకబుల్ స్టార్ ఎవరైనా ఉన్నారంటే అది కేవలం విజయ్ మాత్రమేనని అర్చన అన్నారు.

ఆయనతో సినిమా తీస్తే పెట్టిన బడ్జెట్ ఏ రూపంలోనైనా తిరిగి చేతికొచ్చేస్తుందని ఆమె తెలిపారు. స్పోర్ట్స్ ఆధారిత డ్రామాగా తెరకెక్కిన బిగిల్ సినిమాలో నయనతార కథానాయికగా నటించగా ఈ సినిమాకు అట్లీ దర్శకత్వం వహించారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌కు విశేషమైన స్పందన లభించింది. ఈ ట్రైలర్‌ విడుదలైన కొద్ది గంటల్లోనే రికార్డ్ వ్యూస్‌ సాధించి ఆల్ టైం రికార్డ్ సృష్టించింది.

బిగిల్ ట్రైలర్‌ను పది నిమిషాల్లోనే 20 లక్షల మంది వీక్షించగా, మొదటి గంటలో దాదాపు 6 మిలియన్‌ (60 లక్షల)కు పైగా వీక్షించారు. సోషల్ మీడియాలో టాప్‌ ట్రెండ్‌ అయిన ఈ ట్రైలర్ రెండు గంటల 45 నిమిషాల్లోనే కోటి మందికి పైగా వీక్షించటం విశేషం. అంతేకాదు కేవలం ఒక్క గంటలోనే ఈ ట్రైలర్‌ పది లక్షలకు పైగా లైకులు సాధించి మరో రికార్డ్‌ను తన ఖాతాలో వేసుకుంది. అక్టోబర్ 27న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: