యంగ్ హీరో విజయ్‌ దేవరకొండను టాలీవుడ్ సెన్సేషనల్‌ హీరోగా మార్చేసిన సినిమా అర్జున్ రెడ్డి. ఈ సినిమాతో విజయ్‌ జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. దర్శకుడు సందీప్‌ రెడ్డి కెరీర్‌ను తార స్థాయికి చేర్చిన సినిమా అర్జున్‌ రెడ్డి. అందుకే ఈ సినిమా ఇతర భాషల్లోనూ రీమేక్‌ చేశారు.

తెలుగులో సూపర్‌ హిట్ అయిన అర్జున్‌ రెడ్డి సినిమాను హిందీలో కబీర్‌ సింగ్‌ పేరుతో రీమేక్‌ చేశారు. షాహిద్‌ కపూర్‌ హీరోగా సందీప్‌ దర్శకత్వంలోనే ఈ సినిమా తెరకెక్కించారు. బాలీవుడ్ నెగెటివ్‌ టాక్‌తోనే 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సత్తా చాటాడు అర్జున్‌ రెడ్డి. కోలీవుడ్‌ లోనూ అర్జున్‌ రెడ్డి కథ సత్తా చాటేందుకు రెడీ అవుతోంది.

విక్రమ్‌ తనయుడు ధృవ్‌ విక్రమ్‌ హీరోగా ఆదిత్య వర్మ అనే పేరుతో అర్జున్ రెడ్డి త్వరలో రిలీజ్‌కు రెడీ కానుంది. ఈ సినిమాకు సందీప్‌ రెడ్డి వంగా శిష్యుడు గిరీశయ్య దర్శకత్వం వహించాడు. ఇంతటి సెన్సేషన్‌ సృష్టించిన కథ, కాంబినేషన్‌ కావటంతో ఒరిజినల్ అర్జున్‌ రెడ్డి కాంబినేషన్‌ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే త్వరలోనే అభిమానుల కోరిక నెరవేరనుందని తెలుస్తోంది. 

సందీప్‌ రెడ్డి వంగా, విజయ్‌ దేవరకొండ కాంబినేషన్‌లో మరో సినిమాకు రంగం సిద్ధమవుతోంది. ఈ విషయాన్ని సందీప్‌ అధికారికంగా ప్రకటించాడు. ఇటీవల ఓ అవార్డ్స్‌ ఫంక్షన్‌లో మాట్లాడిన సందీప్‌ త్వరలోనే విజయ్‌తో సినిమా చేయబోతున్నట్టుగా తెలిపాడు. అయితే ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు ఉంటుంది, ఎలాంటి కథతో ఉంటుంది అన్న విషయంపై మాత్రం సందీప్‌ క్లారిటీ ఇవ్వలేదు. కానీ ఈ సినిమా పట్టాలెక్కడానికి ఏడాదికి పైగా సమయం పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం విజయ్‌ దేవరకొండ, వరల్డ్ ఫేమస్ లవర్, హీరో, ఫైటర్‌

 సినిమాలతో బిజీగా ఉన్నాడు. అయితే ఈ ఇద్దరి కాంబినేషన్ లో రానున్న చిత్రం  అర్జున్ రెడ్డి రేంజ్ లో ఉండొచ్చని ఎక్సపెక్టషన్...

 

మరింత సమాచారం తెలుసుకోండి: