కృష్ణగాడి వీర ప్రేమగాథ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన పంజాబి బ్యూటీ మెహ్రీన్ కౌర్. ఆ సినిమా హిట్ తో తెలుగులో వరుస అవకాశాలు అందుకుంటుంది మెహ్రీన్ కౌర్. ఒక హిట్టు రెండు ఫ్లాపులు అన్నట్టుగా అమ్మడి టాలీవుడ్ కెరియర్ కొనసాగుతుంది. ఈ ఇయర్ ఎఫ్ 2తో హిట్ కొట్టిన మెహ్రీన్ కౌర్ రీసెంట్ గా వచ్చిన చాణక్య పెద్దగా ఆకట్టుకోలేదు. 


అయితే పంథా మార్చితే తప్ప పని కాదని అనుకున్న మెహ్రీన్ కౌర్ ఇక మీదట గ్లామర్ షోకి తాను సిద్ధమని అంటుంది. ఈమధ్య హీరోయిన్స్ హాట్ షోకి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. పాత్ర ప్రాధాన్యత ఉన్నా లేకున్నా సరే గ్లామర్ షో చేయడం ఈమధ్య హీరోయిన్స్ కు అలవాటుగా మారింది. అయితే కెరియర్ కొన్నాళ్లు కొనసాగాలంటే స్కిన్ షో చేయక తప్పదని వాళ్లు ఫిక్స్ అయ్యారు.


ఇప్పటివరకు మెహ్రీన్ గ్లామర్ విషయంలో స్పెషల్ గా ఇంట్రెస్ట్ చూపించలేదు. లిప్ లాక్ సీన్స్, హాట్ సీన్స్ ను చేయలేదు అయితే ఇక మీదట వాటికి కూడా సై అంటుంది అమ్మడు. తను కూడా అలాంటి బోల్డ్ పాత్రలకు సరే అని చెబుతుంది. మెహ్రీన్ ఒకవేళ బోల్డ్ పాత్రల్లో నటిస్తే మాత్రం ఆమె క్రేజ్ మరింత పెరిగే అవకాశం ఉంది.


ప్రస్తుతం తెలుగులో మంచి అవకాశాలే దక్కించుకుంటున్న మెహ్రీ కౌర్ ఫీమేల్ లీడ్ సినిమాలను చేసేందుకు నేను రెడీ అంటుంది. అయితే సౌత్ లోనే కాదు బాలీవుడ్ లో కూడా సినిమాలు చేయాలని చూస్తుంది మెహ్రీ కౌర్. అక్కడ ఎలాంటి చిన్న ఛాన్స్ వచ్చినా సరే వదులుకోనని చెబుతుంది. మరి మెహ్రీ కోరుకునే ఆ ఛాన్స్ వచ్చి అమ్మడికి హిట్టు దక్కాలని ఆశిద్దాం. సోలోగానే కాదు ఇద్దరు హీరోయిన్స్ ఉన్న సినిమాల్లో కూడా చేసేందుకు ఎలాంటి ఇబ్బంది లేదంటున్న మెహ్రీన్ కౌర్ ఇక మీదట ఎలాంటి సినిమాలు చేస్తుందో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: