ఇండియా టీంలో గ్రౌండ్‌లో బంతులను బ్యాట్స్‌మెన్‌  వైపు విసురుతుంటారు క్రికెటర్స్‌ హర్బజన్‌ సింగ్, ఇర్ఫాన్‌ పటాన్‌. ఇప్పుడు ఈ ఇద్దరు ఇండియన్‌ బౌలర్లు రూటు మారుస్తున్నారు. తమిళ సినిమాల్లో కీలక పాత్రల్లో ఈ ఇద్దరూ నటించబోతున్నట్టు వెల్లడించారు. అజయ్‌ జ్ఞానముత్తు దర్శకత్వంలో విక్రమ్‌ ఓ సినిమా చేస్తున్నారు అని అందరికి తెలిసిందే. ఈ సినిమాలో ఇర్ఫాన్‌ పటాన్‌ ముఖ్య పాత్రలో చేస్తున్నాడు. అలాగే కమెడియన్‌ సంతానం త్రిపాత్రాభినయం చేస్తున్న సినిమా ‘డిక్కీలోనా’. ఈ సినిమాలో హర్బజన్‌ నటిస్తున్నాడు . గ్రౌండ్‌లో వికెట్లు తీసిన ఈ బౌలర్స్, థియేటర్స్‌లో టికెట్లు ఎలా తెంపిస్తారో చూడాలి మరి.


టీమిండియా తరపున ఓ వెలుగు వెలిగిన ప్రముఖ క్రికెటర్లు ఇప్పుడు కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు.. ఒకరు స్పిన్‌తో ఆకట్టుకుంటే.. మరొకరు ఫాస్ట్ బౌలింగ్‌తో టీమిండియాకు మంచి విజయాలను సాధించడంతో పాటు.. అభిమానులు దగ్గించుకున్నారు. ఆ ఇద్దరు క్రికెట్ గ్రౌండ్ హీరోలు ఇప్పుడు.. వెండితెర మైదానంలో అగుడు పెట్టనున్నారు. ఈ ఇద్దరు క్రికెటర్లు ఇప్పుడు కోలీవుడ్‌ సినిమాలతో తెరగేట్రం చేసేందుకు సిద్ధమయ్యారు అని తెలుస్తుంది. 


తమిళ దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో తెరకెక్కనున్న మూవీలో నటించనున్నాడు పఠాన్.. తమిళస్టార్ హీరో విక్రమ్ ఈ మూవీలో ఇర్ఫాన్ కీలక పాత్ర చేస్తున్నారు. దీనిపై సోషల్ మీడియాలో స్పందించిన ఇర్పాన్.. తాను కొత్త వెంచర్‌లో కొత్త సవాళ్ల కోసం ఎదురు చూస్తున్నానని ట్వీట్ చేయడం జరిగింది. మరోవైపు కార్తీక్ యోగి దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘డిక్కీలూనా’ సినిమాలో హర్భజన్ సింగ్ చేస్తున్నారు. తాను తమిళ సినిమాతో పరిచయమవుతున్నట్లు హర్భజన్ సింగ్ సోషల్ మీడియా ద్వారా తెలియచేశారు.

కాగా, ఈ ఇద్దరు క్రికెటర్లు టీమిండియాకు దూరమయ్యారు.. పఠాన్ 2012 నుంచి ఇంటర్నేషనల్ క్రికెట్‌ మ్యాచ్‌లు అసలు ఆడడం లేదు.. ఇక, భజ్జీ 2016లో చివరిసారి టీమిండియా తరపున ఆడాడు... అయితే, ఐపీఎల్‌లో మాత్రం హర్భజన్ సింగ్ తన  సత్తా చాటుతూనే వస్తున్నాడు. ఇక మైదానాన్ని విడిచి.. వెండితెరపైకి వెళ్తున్న క్రికెట్ హీరోలు.. ఎలాంటి విజయాలు సాధిస్తారో చూడాలి మరి.



మరింత సమాచారం తెలుసుకోండి: