మాస్ మహారాజ రవితేజ కి చాలా కాలంగా మాంచి మాస్ హిట్ లేదు. మధ్యలో అనిల్ రావిపూడి రాజా ది గ్రేట్ వంటి ఒక బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన ఆ తర్వాత నేల టికెట్, అమర్ అక్బర్ ఆంటోని మళ్ళీ రవితేజ కి భారీ ఫ్లాప్స్ ని ఇచ్చాయి. దాంతో మళ్ళీ కథ మొదటికే వచ్చేసింది. అయితే ప్రస్తుతం రవితేజ - విఐ ఆనంద్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా డిస్కోరాజా. ఈ సినిమా మీద రవితేజ చాలా ఆశలు పెట్టుకున్నారు. రవితేజ మాత్రమే కాదు డైరెక్టర్ కి కూడా ఈ సినిమా సక్సస్ చాలా కీలకం అని చెప్పాలి. ఇక ఈ సినిమాను డిసెంబర్లో విడుదల చేస్తారని అని టాక్ వుంది. అలానే ఫిబ్రవరి లేదా  సమ్మర్ మొదలయ్యో ముందు కూడ రిలీజ్ ఉంటుందన్న గాసిప్ కూడా బాగా ఫిల్మ్ నగర్ సర్కిల్ లో చక్కర్లు కొడుతోంది. ఎందుకంటే సినిమాకు కాస్త గ్రాఫిక్స్ వర్క్ ఎక్కువగా వుండడంతో డిసెంబర్ లో రిలీజ్ చేయడం  కష్టం అని చెప్పుకుంటున్నారు. 

ఇదిలావుండగా ఈ సినిమా సురేష్ మూవీస్ డిస్ట్రిబ్యూటర్స్ సంస్థ తెలుగు రాష్ట్రాల్లో పంపిణీకి తీసుకుందని లేటెస్ట్ న్యూస్. సాధారణంగా రవితేజ లాంటి పెద్ద హీరోల సినిమాలు అమ్ముకుంటారన్న సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా అదే జరుగుతోంది. కానీ డిస్కోరాజా నిర్మాత రామ్ తాళ్లూరి మాత్రం తన సినిమాను డిస్ట్రిబ్యూషన్ కు ఇవ్వడం విశేషం. అది కూడా ఎటువంటి అడ్వాన్స్ లేకుండా డిస్ట్రిబ్యూషన్ కు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పుడిది ఇండస్ట్రీలో ఒక హాట్ టాపిక్ గా మారింది.

అంతేకాదు ఇంకో 5-6 సినిమాలను కూడా ఒకేసారి సురేష్ మూవీస్ డిస్ట్రిబ్యూషన్ కు తీసుకుందని తెలుస్తోంది. శ్రీ హీరోగా నటించిన విష్ణు తిప్పరా మీసం తీసుకున్నారట. రీసెంట్‌గా బ్రోచేవారెవరురా మంచి కమర్షియల్ హిట్ ని అందుకుంది. దాంతో తిప్పరా మీసం సినిమా మీద మంచి అంచనాలున్నాయి. ఇక తరుణ్ భాస్కర్.. మీకు మాత్రమే చెప్తా, పీపుల్స్ మీడియా 'వెంకీ మామ', సల్మాన్ ఖాన్ దబాంగ్ 3 సినిమాలు సురేష్ సంస్థ డిస్ట్రిబ్యూట్ చేయబోతోంది. మొత్తానికి సురేష్ మూవీస్ డిస్ట్రిబ్యూషన్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దుమ్మురేపబోతోందనమాట. 



మరింత సమాచారం తెలుసుకోండి: