తన నటనతో తమిళంలోనే కాకుండా దక్షణాది ప్రజలకు సుపరిచితుడైన హీరో కార్తీ. తమిళ హీరో సూర్య తమ్ముడైన ఈ హీరో తన సొంత నటనతో మంచి పేరు తెచ్చుకున్నాడు హీరో కార్తీ. కెరియర్ లో చెప్పుకోదగ్గ పెద్ద సినిమాలు లేక పోయిన తన నటనతో మెప్పించాడు ఈ హీరో. ఇంతకు ముందు ఈ తమిళ హీరో నటించిన ఆవారా, యుగానికి ఒక్కడు, ఇటీవ విడుదల అయిన చిన బాబు వంటివి మనకు గుర్తుకు వచ్చే తెలుగు సినిమాలు.


‘దేవ్‌’ చిత్రంతో నిరాశ పరిచిన తమిళ హీరో కార్తీ తాజాగా ‘ఖైదీ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. లోకేశ్‌ కనకరాజ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని డ్రీమ్ వారియర్ పిక్ఛర్ సంస్ధ నిర్మిస్తోంది. ఈ చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా దీపావళి కానుకగా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారిక ప్రకటన చేసింది. ఇప్పటికే విజయ దశమి కానుకగా ఈ సినిమాకు సంబంధించిన తమిళ ట్రైలర్‌ను విడుదల చేయగా కాగా ఇప్పుడు ‘ఖైదీ’ తెలుగు ట్రైలర్‌ను ఈ రోజు చిత్ర బృందం విడుదల చేసింది.


ఈ సందర్భంగా హీరో కార్తీ ట్రైలర్‌ను షేర్‌ చేస్తూ ‘నో సాంగ్స్‌ ,నో రొమాన్స్‌.. జస్ట్‌ యాక్షన్‌ అండ్‌ థ్రిల్‌’ అంటూ ట్వీట్‌ చేశాడు ఈ హీరో. ఇక ఈ చిత్రంలో కార్తీ పూర్తిగా మాస్‌ లుక్‌ లో కనిపించనున్నాడు. ఈ సినిమా ట్రైలర్‌లో ‘పదేళ్లు లోపల ఉన్నానని మాత్రమే మీకు తెలుసు. లోపలికి వెళ్లే ముందు ఏం చేసేవాడినో మీకు తెలీదు కదా సార్‌‌’ అంటూ కార్తీ చెప్పిన డైలాగులు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.  ప్రస్తుతం ఈ ట్రైలర్‌ మాస్‌ అభిమానులను తెగ అలరిస్తోంది. అయితే ఈ సినిమాతో కార్తీ మళ్లీ విజయాలబాట ఎక్కుతాడని సినీ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: