ప్రపంచ సంగీత అభిమానులను విషాదంలో ముంచెత్తి ప్రఖ్యాత పాప్ సింగర్ సల్లీ తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయింది. సియోల్‌లోని సియోన్‌గ్నమ్‌లోని తన నివాసంలో విగతజీవిగా పడి ఉండటంతో సంగీత ప్రియులను తీవ్ర దిగ్రాంతికి గురిచేసింది. తన ఇంటిలోని రెండో ఫ్లోర్‌లో నిర్జీవంగా పడిఉండటాన్ని చూసి తన మేనేజర్ వెంటనే ఆస్పత్రికి తరలించారు. వైద్యుల పరీక్ష అనంతరం అప్పటికే మృతి చెందినట్టు ధృవీకరించారు. చిన్న వయసులోనే సల్లీ మరణం చెందడంతో ప్రపంచవ్యాప్తంగా కళాకారులు షాక్‌ గురవుతున్నారు.

25 వయసులోనే దారుణంగా
సల్లీ వయసు 25 సంవత్సరాలు. ఆమె అసలు పేరు చోయ్ జిన్ రి. అక్టోబర్ 14 తెల్లవారు జామున 3.20 నిమిషాలకు మరణించినట్టు వైద్యులు ధృవీకరించారు. ఈ విషయాన్ని ఆమె మేనేజర్ మీడియాకు అధికారికంగా వెల్లడించారు. అనుమానాస్పద మృతి వెనుక అసలు కారణాలు ఏవీ తెలియరాలేదు. సియోల్ పోలీసులు కేసు నమోదు చేసుకొని ప్రాథమిక విచారణ చేపట్టారు.

నెటిజన్లు దుమ్మెత్తిపోసి
కే పాప్ యాక్ట్ ఎఫ్ (ఎక్స్) అనే ఆల్బమ్‌తో సంగీత ప్రపంచంలోకి దూసుకొచ్చారు. అశ్లీలంగా ఉందంటూ నెటిజన్లు దుమ్మెత్తిపోశారు. దాంతో ఓ ఏడాదిపాటు ప్రశంసలతోపాటు విమర్శలు ఎదుర్కొన్నారు. ఆ తర్వాత యాక్టింగ్ ప్రొఫెషన్‌ను సల్లీ ఎంచుకొన్నారు. ఇలా అనూహ్యంగా మృత్యువాత పడటం సంగీత ప్రియులు జీర్ణించుకోలేకపోతున్నారు.

సల్లీ మృతితో
సల్లీ మృతితో నెటిజన్లు విషాదంలో మునిగిపోయింది. ఆమె మృతి వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ అవుతున్నది. సల్లీ.. మీ మరణాన్ని తట్టుకోలేం. మమ్మల్ని వదలి ఈ లోకం నుంచి వెళ్లిపోవడాన్ని ఎవరూ కూడా ఒప్పుకోరు. ఇప్పటి వరకు మిమ్మల్ని ఇష్టపడిన మేము.. ఇక మీ తలరాతను అసహ్యించుకొనేలాచేసింది అంటూ నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు.

విషాదంలో అభిమానులు
సల్లీ.. ఇక అసలు చోయ్ జిన్రీ అనే పేరుతో పిలుస్తాను. చాలా కష్టపడి పైకి వచ్చావు. మానసికంగా నీవు చాలా ధృడమైన వ్యక్తివి. అంతేకాకుండా అందగత్తెవి. మిమ్మల్ని మేము కాపాడుకోలేకపోయినందుకు చింతిస్తున్నాం. అందుకు సారీ చెబుతున్నాను. ఈ ప్రపంచం మొత్తం కోరుకొనే వ్యక్తివి నీవు అంటూ ఓ అభిమాని ట్వీట్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: