తెలుగు సినిమా సంగీత దర్శకుల్లో దేవిశ్రీప్రసాద్ కు ప్రత్యేక స్థానం ఉంది. దాదాపు 20 ఏళ్ల క్రితం అతని ప్రస్థానం మొదలయింది. ఈ జనరేషన్  సంగీత దర్శకుల్లో టాప్ ప్లేస్ సంపాదించాడు. ఎవరికి ఏ సంగీతం ఇవ్వాలో సరిగ్గా తెలిసిన సంగీత దర్శకుడు. మాస్ బీట్స్ ఇవ్వడంలో దేవి స్పెషల్. అటువంటి దేవి ఇటీవల ఓ హిట్ సినిమా నుంచి తప్పుకున్నాడు. ఆ సినిమా గద్దలకొండ గణేశ్. అయితే ఈ సినిమా నుండి దేవీనే తప్పుకున్నాడా.. తప్పించారా అనే డౌట్ ఉంది. దానిని ఈ చిత్ర దర్శకుడు హరీశ్ శంకర్ రివీల్ చేసాడు.

 

 

 

ఈ సినిమాలో కథానుసారం హరీశ్ కు 'వెల్లువొచ్చే గోదారమ్మా..' పాట రీమిక్స్ చేయాలి. అదే విషయం దేవీతో చెప్పాడట హరీశ్. అయితే రీమిక్స్ చేయడం తన పాలసీకి విరుద్ధమని, జీవితంలో రీమిక్స్ చేయకూడదని నిర్ణయించుకున్నాని చెప్పాడట దేవి. కానీ ఆ పాట అవసరం అని గట్టిగా భావించిన తాను దేవీని ఇబ్బంది పెట్టకూడదని నిర్ణయించుకున్నాడట. దీంతో ఆలోచించి మిక్కీ జె మేయర్ ని రంగంలోకి దించాడట. దీంతో ఫస్ట్ పోస్టర్ రిలీజ్ లో దేవిశ్రీప్రసాద్ పేరు వేసిన తర్వాత కూడా సంగీత దర్శకుడిని మార్చానని హరీశ్ చెప్పుకొచ్చాడు.

 

 

 

హరీశ్ శంకర్ - దేవిశ్రీప్రసాద్ కాంబోలో గబ్బర్ సింగ్, దువ్వాడ జగన్నాధం సినిమాలు వచ్చాయి. సంగీతం పరంగా ఇవి మంచి హిట్స్. దీంతో దేవితో ఉన్న రాపోతో మళ్లీ ఈ కాంబినేషన్ రిపీట్ చేయాలని భావించాడు. మొత్తానికి మిక్కీ కూడా మంచి మాస్ బీట్స్ ఇచ్చి గద్దలకొండ గణేశ్ హిట్ లో భాగమయ్యాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: