హీరోల బర్త్ డే అంటే వారి అభిమానులు చేసే హంగామా అంతా ఇంతా కాదు. అభిమానుల కోసమే పుట్టినరోజు వేడుకలు చేసుకునే హీరోలు చాలా మంది ఉన్నారు. అయితే ఆ అభిమానం హద్దుల్లో ఉంతే బాగుంటుంది. కొన్ని సార్లు అభిమానం అవసరానికి మించిపోయి అనవసర చికాకులని కూడా తెచ్చిపెడుతుంది. ఇలా అభిమానుల వల్ల బాధపడ్డ హీరోలు కూడా ఉన్నారు.  ఆ విషయం అటుంచితే, పుట్టినరోజు నాడు అభిమానుల కోసం తమ కొత్త సినిమా పోస్టర్ నో, టీజర్ నో రిలీజ్ చేస్తుంటారు.


ఈ విధంగా తమ అభిమానులకి బహుమతి ఇస్తుంటారు. అయితే వీటన్నింటికి అతీతంగా సాయి ధరమ్ తేజ్ కొత్తగా ప్రయత్నించి అదరహో అనిపించాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక వీడియోని పోస్ట్ చేశాడు. తన పుట్టిన రోజు సందర్భంగా చాలామంది మెగా ఫ్యాన్స్ మంచిపనులు చేస్తున్నారని.. వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నానని చెప్పాడు. 


ప్రతీ సంవత్సరం పుట్టినరోజు నాడు ఇలాంటి పనులు చేస్తుంటాం. కానీ  ఈ సారి ఒక సమస్యకి  శాశ్వత పరిష్కారం చూపిస్తే ఎలా ఉంటుందని ఒక ఆలోచన వచ్చింది. దాన్నిఇలా పంచుకుంటున్నాను.  ట్విట్టర్ లో ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ వారు నన్ను టాగ్ చేసి ఆ ఓల్డ్ ఏజ్ హోమ్ నిర్మాణానికి సహాయం కోరారు. ఆ మొత్తం ఖర్చును నేను పెట్టుకునేందుకు సిద్ధం అయ్యాను. నిర్మాణం పూర్తయిన తర్వాత మొదటి ఏడాది ఖర్చు కూడా మేమే చూసుకోవాలని అనుకున్నాం.


ఈ సందర్భంగా నేను మెగా ఫ్యాన్స్ ను చేస్తున్న కోరేది ఏంటంటే.. నా బర్త్ డే కోసం ఫ్లెక్సీలు వద్దు. మీరు వాటి కోసం పెట్టే ఖర్చు.. లేక నా బర్త్ డే కోసం పెట్టే ఖర్చు అది ఎంతైనా సరే అది పది రూపాయలైనా.. ఒక రూపాయ అయినా.. నాకు ఇస్తే నేను ఓల్డ్ ఏజ్ వారి కోసం ఖర్చు పెడతాను. దీనికి ఇప్పటికే చాలామంది ఫ్యాన్స్ స్పందించి ఒక లక్షరూపాయలు విరాళం ఇచ్చారు. నాకు విజ్ఞప్తిని మన్నించి సాయం చేసిన వారందరికీ థ్యాంక్స్ అని తెలియజేశాడు. సాయి తేజ్ ఆలోచనకి నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 





మరింత సమాచారం తెలుసుకోండి: