ప్రభూత్వాలను కామెంట్ చేసినా, విమర్శించిన ఆ ప్రభుత్వం వాళ్ళు పగ పడతారన్న విషయం కొంతమంది సినిమా సెలబ్రిటీల విషయం లో మనం అప్పుడప్పుడు చూస్తూనే వున్నాము. గత జులై నెలలో 49 మంది సెలెబ్రిటీలు భారత దేశంలో అసహనం పెరిగిపోతుందని - సామూహిక హత్యలు ఈ దేశానికే మచ్చ తెస్తున్నాయన్న విషయంలో ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేయాలని ప్రధాని మోడీకి లేఖ రాసిన విషయం సంచలనం అయిన సంగతి తెలిసిందే. వీళ్ళలో అందరు సినిమావాళ్ళే ఉండటం చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ లేఖపై బీహార్ కి చెందిన ఒక వ్యక్తి ఆ లేఖ.. మతపరమైన భావాలను రెచ్చగొట్టేట్టు ఉందని ఆ 49 మంది సెలెబ్రిటీలపై 'దేశద్రోహం' కేసు కూడా వేశాడు. దీంతో బీహార్ పోలీసులు ఈ సెలెబ్రిటీలపై పలు సెక్షన్స్ కింద కేసు నమోదు చేయడం కూడా ఆసక్తికరంగా మారింది.

అయితే ఈ కేసు విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని చాలా మంది సెలెబ్రిటీలు విమర్శించారు కూడా. ఇప్పటికే బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న వారిని దేశ ద్రోహులుగా చూస్తున్నారంటూ ప్రతిపక్షాలు నానా రాద్ధాంతం చేస్తున్నాయి. మోడీ ప్రభుత్వాన్ని చిన్న విమర్శ చేసిన వాళ్ళని కోర్టు కేసులు అంటూ తిప్పుతున్నారని అన్యాయంగా కేసుల్లో ఇరికించి జైళ్లలో పెడుతున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. మోడీకి లేఖ రాసిన 49 మందిపై కేసులు పెట్టడాన్ని దీనికి ఉదాహరణగా  చెప్తున్నారు. అంతేకాదు మోడీ ప్రభుత్వం దేశాన్ని నియంత పాలనలోకి తీసుకువెళ్ళిందని.. దేశంలో స్వేచ్ఛ పూర్తిగా తగ్గొపోతోందని మోడీ ప్రభుత్వం మీద ప్రతిపక్షాలు దారుణంగా విమర్శిస్తున్నారు.

ఇలా ఉంటే తాజాగా బాలీవుడ్ నటి స్వర భాస్కర్ బీజేపీ గవర్నమెంట్ మీద విమర్శలు చేయడం ఇప్పుడు ఒక హాట్ టాపిక్ అయింది. స్వర నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'షీర్ కొర్మ' సినిమా పోస్టర్ రిలీజ్ సందర్భంగా ఆమె ఈ విమర్శలు చేసింది. తాను 2019 లోక్ సభ ఎలెక్షన్స్ లో ఆప్ పార్టీ సిపిఎం పార్టీల అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేశానని ఆ టైములో నేను నాలుగు బ్రాండ్లకు యాడ్స్ చేసేదానిని అని.. కానీ ఆ ఎలెక్షన్ ప్రచారం తర్వాత తను ఆ నాలుగు బ్రాండ్లని కోల్పోయానని స్వర వాపోయింది. అయితే నన్ను నేను ఎప్పుడు ఒక స్టార్ గా అనుకోలేదు...అంటూనే తనకు జరిగింది మాత్రం అన్యాయం అని తనలోని బాధను బయటకు చెప్పింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: