దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి' సినిమాలో శివగామి క్యారక్టర్ కి ఎంత పేరొచ్చిందో అందరికీ తెలిసిందే. రాజమౌళి కూడా చాలా సందర్భాల్లో తనకు 'బాహుబలి' లో శివగామి క్యారక్టర్ అంటే మిగిలిన క్యారెక్టర్ల కంటే ఎక్కువ ఇష్టం అని చెప్పారు. ఇప్పుడు ఇండియాలో ఏ భాషలో అయినా రమ్యకృష్ణ పేరు చెప్తే వెంటనే శివగామి అనేంతగా ఆ పాత్ర సినీ ప్రియులను ఆకట్టుకుంది. అంతగా ఆ పాత్రలో ఇమిడిపోయారు రమ్యకృష్ణ. కెరీర్ బిగినింగ్ లో ఐరెన్ లెగ్ అన్న ట్యాగ్ ఉన్న రమ్యకృష్ణ కి 1999లో వచ్చిన 'నరసింహ' సినిమాలో నీలాంబరి క్యారక్టర్ నుండి రాజమౌళి శివగామి క్యారక్టర్ వరకు ఆవిడ కేరీర్ గ్రాఫ్ ఎవరు అంచనా వేయనంతగా మారిపోయింది. కానీ రమ్యకృష్ణ భర్త, క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ కెరీర్ మాత్రం అంతంత మాత్రంగానే ఉంది. 

నిన్నే పెళ్ళాడతా, మురారి, ఖడ్గం, రాఖీ, చందమామ వంటి సినిమాలు ఆయన కెరీర్ లో ఎప్పటికి గుర్తుండిపోయో సినిమాలు. అయితే అంతకుమించి ఫ్లాప్స్ ఉండటంతో గతకొంత కాలంగా హిట్ అనే మాటకు చాలా దూరంగా ఉండిపోయారు. వాస్తవంగా చెప్పాలంటే కృష్ణవంశీ మంచి హిట్ సినిమా తీసి 12 సంవత్సరాలు అవుతుంది. ఆ తర్వాత చాలా సినిమాలు చేశాడు కానీ అవేవీ సక్సస్ ని ఇవ్వలేకపోయాయి. 2004లో కృష్ణవంశీ తీసిన 'శ్రీ ఆంజనేయం' సినిమాలో రమ్యకృష్ణ నటించారు. ఆ తర్వాత తన భర్త తీసిన ఏ సినిమాలోనూ రమ్యకృష్ణ నటించలేదు. దాంతో చాలామంది ఈ ఇద్దరికీ మనస్పర్థలు వచ్చాయని త్వరలోనే విడిపోతారని ఒక విచిత్రమైన ప్రచారం కూడా చేశారు. అయితే  అవన్నీ వట్టి రూమర్లేనని ఎప్పుడో క్లారిటి ఇచ్చారు. 

ఇంతకాలం తన కెరీర్ గురించే ఆలోచించిన రమ్యకృష్ణ ఇప్పుడు భర్తకి కూడా ఒక హిట్ సినిమా పడాలని అనుకుంటున్నట్లు తాజా సమాచారం. అంతేకాదు కృష్ణవంశీ తర్వాత తీయబోయే సినిమాలో ఆమె ఒక పవర్ ఫుల్ క్యారక్టర్ చేస్తున్నట్టు లేటెస్ట్ న్యూస్. మరి ఈసారైనా కృష్ణవంశీ హిట్ కొట్టి తను క్రియేటివ్ డైరెక్టర్ అన్న పేరు నిలబెట్టుకుంటాడో లేదో చూడాలి. అయితే ఇంతకముందు కొన్ని ఇంటర్యూస్ లో కృష్ణవంశీ రమ్యకృష్ణ తన డైరెక్షన్ లో చేయడానికి ఇంట్రస్ట్ చూపించదని చెప్పాడు. ఇప్పుడది కూడా ఒక హాట్ టాపిక్ గా మాట్లాడుకుంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: