ఇటీవల  ఓ బేబీ తో ప్రేక్షకులముందుకు వచ్చి  సూపర్ హిట్ కొట్టిన  స్థార్  హీరోయిన్ సమంత కొద్దీ రోజల క్రితం  96తెలుగు రీమేక్ షూటింగ్  కూడా పూర్తి చేసింది.  ఇక సమంత ఈ చిత్రం తరువాత మరో సినిమా కు సైన్ చేయలేదు. దాంతో  ఆమె సినిమాలకు   గుడ్ బై చెప్పనుందని వార్తలు వచ్చాయి.  ఇదిలావుంటే  ఇప్పుడు  సమంత  సినిమాల్లో కాకుండా ఓ  వెబ్ సిరీస్ లో నటించాడని గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం.  


బాలీవుడ్ విలక్షణ నటుడు  మనోజ్ బాజ్ఫై  , ప్రియమణి ,గుల్ పనాగ్ , కిషోర్  తదితరులు  ప్రధాన పాత్రల్లో  నటించిన  వెబ్ సిరీస్... ' ది ఫ్యామిలీ మ్యాన్'.  ఇటీవల  ఈసిరీస్ అమెజాన్ ప్రైమ్ లో  ప్రసారం కాగా  ఆ ఎపిసోడ్లకు  సూపర్ రెస్పాన్స్ వచ్చింది.  ఇంట్రెస్టింగ్  స్క్రీన్ ప్లే , అలాగే అద్భుతమైన   స్టోరీ తో వచ్చిన  ఈ వెబ్ సిరీస్  నెటిజన్లను  విపరీతంగా ఆకట్టుకుంది.  హిందీలో రూపొందిన  ఈ వెబ్ సిరీస్ ఇంగ్లీష్ , తెలుగు, తమిళ భాషల్లో కూడా ప్రసారం అవుతుంది. ఐఎండిబి లో కూడా  ఈ వెబ్ సిరీస్ 8.9 రేటింగ్స్ ను రాబట్టుకుంది. 



ఇక ఈ వెబ్ సిరీస్ మొదటి సీజన్  సూపర్ హిట్ కావడంతో  డైరెక్టర్లు  రాజ్ మరియు డీకే దీనికిసీక్వెల్  ను  రూపొందించడానికి ప్లాన్ చేస్తున్నారు.  అందులో  భాగంగా ఈ సీక్వెల్ లో ఓ కీలక పాత్ర కోసం సమంత ను సంప్రదించగా అందుకు ఆమె ఓకే చెప్పిందట.  ఇక  ఈ సీజన్ 2 లో  సమంత  నెగిటివ్ పాత్రలో నటించనుందని సమాచారం. ఇప్పటివరకు ఆమె ఏ సినిమాలో  కూడా ఇలాంటి పాత్రలో నటించలేదు. ఫస్ట్ టైం  ఈ వెబ్ సిరీస్ ద్వారా  సమంత నెగిటివ్ పాత్రలో నటిస్తుంది. మరి ఈ పాత్రలో  సమంత  ఎంత వరకు మెప్పిస్తుందో చూడాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: