యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ టాలీవుడ్ బాహుబలి. ఇంకా చెప్పాలంటే ఆలిండియా స్క్రీన్ మీద కూడా తన సత్తా చాటిన వన్ అండ్ ఓన్లీ తెలుగు హీరో.  తెలుగు నుంచి హిందికి వెళ్ళి కోట్లు కొల్లగొట్టి సాహో అనిపించున్న స్టార్. ప్రభాస్ సాహో పెద్ద హిట్ అయితే ఏమో కానీ ఇపుడు ఫట్ కావడంతో ఆయన వైపు నుంచి ఎలాంటి సందడి లేకుండా ఉంటోంది.  ప్రభాస్ ఇపుడు తన తరువాత మూవీ మీద ద్రుష్టి పెట్టి బుద్ధిగా పనిచేసుకుంటున్నాడుట.


ఆ మూవీ రాధాక్రిష్ణ డైరక్షన్లో సాగుతోంది. దానికి జాన్ అని అనుకుంటున్నా ఇంకా అసలు టైటిల్ డిసైడ్ కాలేదని అంటున్నారు. మంచి టైటిల్ పెట్టాలని యూనిట్ భావిస్తోందట. ఇక ప్రభాస్ ఈ మూవీలో పూజా హెగ్డెతో రొమాన్స్ చేస్తున్నాడు. ఇందులో ప్రభాస్ ఫక్త్ లవర్ బాయ్ గా కనిపిస్తాడట. అంటే ఇంతకు ముందు జోష్ ప్రభాస్ నుంచి చూడొచ్చన్నమాట. ఇదిలా ఉండగా తన పుట్టినరోజు అయిన ఈ నెల 23 నాటికి ప్రభాస్ అబ్రాడ్ లో ఉంటున్నాడు. అక్కడే ఆయన పుట్టిన రోజు జరుగుతుంది అంటున్నారు. ఇక ప్రభాస్ తన బర్త్ డే స్పెషల్ గా ఏ విషయం చెప్పబోతున్నారోనని ఫ్యాన్స్ ఆసక్తిగా చూస్తున్నారు.


తన కొత్త సినిమా టైటిల్ అనౌన్స్ చేస్తాడా, లేక అందులో నుంచి టీజర్ లాంటిది ఏదైనా వదులుతాడా అని వేచిచూస్తున్నారు. ఇక ప్రభాస్ ఈ పుట్టిన రోజు నాటికి నలభయ్యవ వడిలోకి అడుగుపెడుతున్నాడు, దాంతో ఆయన తన‌ పెళ్ళి మ్యాటర్ ఏమైనా లీక్ చేస్తాడా అని కూడా ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. అయితే ప్రభాస్ ఏం ఆలోచించుకున్నాడో, ఏం చెబుతాడో ఇప్పటికైతే తెలియదు. ఒకవేళ ఏమీ అనౌన్స్ మెంట్ లేకపోతే మాత్రం ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవడం ఖాయం. ప్రభాస్ స్వీట్ న్యూస్ ఎపుడు అంటోంది ఫ్యాన్స్ మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: