ఎన్టీఆర్ బయోపిక్ తరువాత  నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం  ప్రముఖ సీనియర్ డైరెక్టర్  కె ఎస్ రవికుమార్ డైరెక్షన్ లో తన  105వ చిత్రం లో నటిస్తున్నాడు. ఇటీవలే ఈ చిత్రం  సెట్స్ మీదకు వెళ్లగా  ప్రస్తుతం శరవేగంగా  షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే   ఈ చిత్రం నుండి విడుదలైన  బాలయ్య స్టిల్స్ కు  సూపర్ రెస్పాన్స్  వచ్చింది. దాంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఇక  తాజాగా ఈ చిత్రం యొక్క  టైటిల్ ను ప్రముఖ టీవి ఛానెల్ జెమిని టీవి రివీల్ చేసింది.   ఈ సినిమా  శాటిలైట్ హక్కులు సొంతం చేసుకున్న  సందర్బంగా  జెమిని టీవి ..బాలకృష్ణ నటిస్తున్న 105వ చిత్రం రూలర్ అని అధికారికంగా ప్రకటించింది.  ఈటైటిలే  పెట్టనున్నారని ఎప్పటినుండో   ప్రచారం జరిగినా..  చిత్ర యూనిట్ మాత్రం స్పెషల్ గా ఈ టైటిల్ ను రివీల్ చేద్దామనుకుంది కానీ జెమిని టీవి వారికీ షాక్ ఇచ్చింది. 




హై  వోల్టేజ్ యాక్షన్  ఎంటర్ టైనర్ గా రానున్న  ఈ చిత్రంలో బాలయ్య కు జోడిగా  సోనాల్ చౌహన్ , వేదిక  నటిస్తుండగా  సీనియర్ నటి  భూమిక  చావ్లా  ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనుందని సమాచారం.   రూలర్ లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో భూమిక కనిపించనుందట. ఆమె పాత్రా సినిమా కు కీలకం కానుంది.  సీకే ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై  సి కళ్యాణ్ నిర్మిస్తున్న  ఈ చిత్రం ఈ ఏడాది చివర్లో  విడుదలకానుంది.   ఈ చిత్రానికి బాలీవుడ్ సంగీత దర్శకుడు చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్నాడు . ఇక కె ఎస్ రవి కుమార్ , బాలకృష్ణ కాంబినేషన్ లో ఇది రెండవ సినిమా. ఇంతకుముందు వీరి కలయికలో వచ్చిన 'జై సింహ' గత ఏడాది జనవరిలో విడుదలై  మంచి వసూళ్లను రాబట్టి హిట్ అనిపించుకుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: