బిగ్ బాస్ హౌస్ లో వాతావరణం చివరి దశకు వచ్చిన క్రమంలో హాట్ హాట్ గా సాగుతోంది. 17 మంది బిగ్ బాస్ హౌస్ లో ఎంటర్ అవ్వగా ప్రస్తుతం ఏడు మంది సభ్యులు మాత్రం మిగిలారు. దీంతో హౌస్ లో వాతావరణం నువ్వా నేనా అన్నట్టు మీ ఇంటి సభ్యుల మధ్య చోటు చేసుకుంది. అయితే ఈ వారం నామినేషన్ల ప్రక్రియలో భాగంగా శివ జ్యోతి వరుణ్ సందేశ్ ల మధ్య ఎక్కువ డిస్కషన్ జరగటంతో ఇంటి సభ్యులంతా...ఎలిమినేషన్ కి నామినేషన్ ప్రక్రియ లో..సెలెక్ట్ కావడం జరిగింది. అయితే ఆ సమయంలో వితికా గురించి ఎక్కువ వాదోపవాదాలు జరుగుతున్న క్రమంలో వరుణ్ సందేశ్ మరియు శివజ్యోతి ల మధ్య మాటల యుద్ధం తారా స్థాయికి చేరుకున్న క్రమంలో సోమవారం జరిగిన ఎపిసోడ్ లో వరుణ్ సందేశ్ తనని దారుణంగా విమర్శించడాన్ని తట్టుకోలేకపోయిన శివ జ్యోతి తన బాధ మొత్తం బాబా భాస్కర్ మరియు శ్రీముఖి లతో చెప్పుకోవడం మంగళవారం ఎపిసోడ్ లో జరిగింది.


ముఖ్యంగా తనని కంత్రి ఆటలు ఆడుతున్నారని వరుణ్ సందేశ్ విమర్శించడాన్ని తట్టుకోలేకపోయిన శివ జ్యోతి కన్నీటి పర్యంతం అయ్యింది. ఇంతలో వరుణ్.. శివజ్యోతి దగ్గరకి వచ్చి.. 'నువ్ నన్ను అనలేదా..? నేను బతకకపోతే అందరికీ ముంచేయాలనే యాటిట్యూడ్ నీది.. ఇది ఎంత బ్యాడ్' అంటూ గొడవని మరింత పెద్దది చేశాడు. ఇంతలో వితికా వచ్చి వరుణ్ ని కూల్ చేసే ప్రయత్నం చేసింది.


ఇక ఈ నామినేషన్స్ పై హౌస్ మేట్స్ ఒకరితో మరొకరు చర్చలు మొదలుపెట్టారు. ఈ క్రమంలో శ్రీముఖి, రాహుల్ ల మధ్య మరోసారి చిన్న వాగ్వాదం చోటు చేసుకుంది. రాహుల్ తనపై కౌంటర్ వేయడంతో తట్టుకోలేని శ్రీముఖి తనతో మాట్లాడొద్దని తెగేసి చెప్పింది. 'నీతో మాట్లాడడానికి నాకసలు ఇంట్రెస్ట్ లేదని' రాహుల్ వెటకరంగా వెయ్యడం జరిగింది. మొత్తంమీద మంగళవారం జరిగిన ఎపిసోడ్ లో బిగ్ బాస్ హౌస్ లో వాతావరణం యుద్ధ వాతావరణాన్ని తలపించింది.  



మరింత సమాచారం తెలుసుకోండి: