టాలీవుడ్ యువరత్న నందమూరి బాలకృష్ణ హీరోగా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఎన్టీఆర్ కథానాయకుడు మరియు ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టిన విషయం తెలిసిందే. వాస్తవానికి విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్ గారి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఆ బయోపిక్ సినిమాలపై తెలుగు ప్రేక్షకులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. అయితే ఆ అంచనాలు అందుకోవడంలో ఆ రెండు సినిమాలు విఫలమవడంతో, తదుపరి చేయబోయే సినిమా విషయమై బాలకృష్ణ ఎంతో ఆచి తూచి వ్యవహరించడం జరిగింది. 

ఇక తన తదుపరి సినిమాకు గత ఏడాది తనకు జైసింహా సినిమా వంటి హిట్ ని అందించిన కేఎస్ రవికుమార్ ను దర్శకుడిగా ఎంచుకున్నారు బాలకృష్ణ. ఇక ప్రస్తుతం బాలకృష్ణ 105వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. బాలకృష్ణ ఈ సినిమాలో ఒక పవర్ఫుల్ డాన్ పాత్రలో నటిస్తున్నట్లు టాలీవుడ్ వర్గాల భోగట్టా. అయితే ఈ సినిమాకు మొదట్లో 'రూలర్' అనే టైటిల్ ని పెడతారని అందరూ భావించారు, ఇక రెండు రోజుల క్రితం టైటిల్ అది కాదు, 'జడ్జిమెంట్' అనే టైటిల్ ని ఆ సినిమా యూనిట్ నిర్ణయించినట్లు వార్తలు వచ్చాయి. అయితే అది కూడా ఒట్టి పుకారేనని తెలుస్తోంది. 

అయితే నేడు ఈ సినిమా శాటిలైట్ హక్కులను కొనుగోలు చేసిన జెమినీ టీవీ సంస్థ, తాము నేడు బాలకృష్ణ గారి 105వ సినిమా అయిన రూలర్ సినిమా హక్కులను కొనుగోలు చేయడం జరిగిందంటూ సోషల్ మీడియా మాధ్యమాల్లో ఒక పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. దీనితో బాలకృష్ణ సినిమాకు రూలర్ అనే టైటిల్ పెట్టబోతున్నట్లు అందరికి ఒక్కసారిగా రివీల్ అయింది. ఇక నందమూరి ఫ్యాన్స్ కూడా తమ హీరో బాలకృష్ణ గారి సినిమాకు రూలర్ అనే టైటిల్ పెడుతున్నట్లుగా ఫిక్స్ అయిపోయి సంబరాలు మొదలెట్టేసారు. కాగా ఈ న్యూస్ నేటి ఉదయం నుండి పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది....!!


మరింత సమాచారం తెలుసుకోండి: