టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా కొన్నేళ్ల క్రితం దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సిరీస్ లోని రెండు సినిమాలు కూడా దేశ విదేశాల్లో ఎంతటి గొప్ప విజయాలు అందుకున్నాయో తెలిసిందే. ఇక ఆ సినిమాల అద్భుత విజయాల తరువాత ప్రభాస్ కు జాతీయ స్థాయితో పాటు అంతర్జాతీయ స్థాయిలోను మంచి గుర్తింపు లభించడంతో పాటు ఆయన మార్కెట్ రేంజ్ కూడా అమాంతం పెరిగిపోయింది. ఇక అంతటి అత్యద్భుత పేరు ప్రఖ్యాతలు సంపాదించిన ప్రభాస్ రేంజ్ కి సరిపోయేలా భారీ ఖర్చుతో ఇటీవల యువి క్రియేషన్స్ బ్యానర్ ఫై సుజీత్ తెరకెక్కించిన సినిమా సాహో. కొద్దిరోజుల క్రితం ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా, ఆ అంచనాలు అందుకోవడంలో మాత్రం దారుణంగా ఫెయిల్ అయింది. అయితే ఆ సినిమా ఫెయిల్యూర్ కు ఆకట్టుకోని కథ, 

కథనాలతో పాటు మ్యూజిక్ కూడా కారణం అని అంటున్నారు సినిమా విశ్లేషకులు. నిజానికి ఆ సినిమాకు తొలుత సంగీత దర్శకులుగా వ్యవహరించిన బాలీవుడ్ మ్యూజిక్ త్రయం శంకర్-ఎహసాన్-లాయ్ లు అర్ధాంతరంగా సినిమాను చివరలో వదిలి వెళ్లిపోవడంతో ఆ సినిమా, మ్యూజిక్ విషయమై కొన్ని సమస్యల్లో చిక్కుకుంది. అయితే ఆ తరువాత హడావుడిగా ముగ్గురు బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్లతో సినిమా యూనిట్ హడావుడిగా మ్యూజిక్ చేయించింది. అయితే ఆ సినిమాలోని సాంగ్స్ ఎక్కువగా నార్త్ వాళ్లకు నచ్చినప్పటికీ, మన వాళ్లకు మాత్రం అంతగా ఎక్కలేదు. ఇక ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ జాన్ విషయంలో కూడా అటువంటి తప్పిదమే జరిగే అవకాశాలు కనపడుతున్నాయట. విషయం ఏమిటంటే, జాన్ సినిమాకు ఇప్పటివరకు సంగీత దర్శకుడు ఎంపిక కాలేదని టాలీవుడ్ వర్గాల సమాచారం. 

గతంలో తన మొదటి సినిమా జిల్ కు సంగీతాన్ని అందించిన జీబ్రాన్ నే దర్శకుడు రాధాకృష్ణ, ఈ సినిమాకు కూడా సంగీత దర్శకుడిగా తీసుకుంటారని అందరూ భావించారు. కానీ ఇప్పటివరకు మాత్రం జాన్ కు సంగీత దర్శకుడిగా ఎవ్వరూ ఎంపిక కాలేదట. సో, దీనిని బట్టి  చూస్తుంటే, సాహో మాదిరిగా జాన్ విషయంలో కూడా ప్రభాస్ సహా ఆ సినిమా యూనిట్ మొత్తం, సినిమా చివరికి వచ్చే వచ్చేవరకు సంగీత దర్శకుడిని ఎంచుకునే పరిస్థితి లేదని, దానితో జాన్ సాంగ్స్ కూడా పెద్దగా ఆకట్టుకునే విధంగా సమకూరే అవకాశం లేదంటున్నారు. మరి ఈ విషయమై ఏమి జరుగుతుందో చూడాలి....!!


మరింత సమాచారం తెలుసుకోండి: