టాలీవుడ్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా ఇటీవల హరీష్ శంకర్ దర్శకత్వంలో ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా గద్దలకొండ గణేష్ సినిమా మంచి హిట్ కొట్టింది. హాట్ భామ పూజ హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై మాస్ చిత్రాల దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వం వహించగా, యువ సంగీత దర్శకుడు మిక్కీ జె మేయర్ సంగీతాన్ని అందించడం జరిగింది. ఇక మొదటి నుండి ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ సినిమా, ఆ అంచనాలు అందుకోవడంలో పూర్తిగా సక్సెస్ అయింది. ఇక తొలిరోజు తొలిఆట నుండి ప్రేక్షకులతో మంచి మంచి మార్కులు వేయించుకున్న గద్దలకొండ గణేష్ పై పలువురు విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించడం గమనార్హం. 

ఇక అప్పటివరకు ఎక్కువగా సాఫ్ట్ గా రొమాంటిక్ పాత్రలు చేస్తూ వచ్చిన వరుణ్ తేజ్, ఒక్కసారిగా ఈ సినిమాలో గద్దలకొండ గణేష్ అనే ఊర మాస్ పాత్రలో నటించడంతో పాటు, ఆ పాత్రలో తన అత్యద్భుతమైన నటనతో మెగా ఫ్యాన్స్ ను మరియు ప్రేక్షకుల మనసులను కూడా గెలిచాడు అనే చెప్పాలి. ఇక ఆ సినిమా ఇచ్చిన మంచి ఊపుతో ఇటీవల కొత్త దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో ఒక సినిమాను మొదలెట్టాడు వరుణ్. అయితే గద్దలకొండ గణేష్ సక్సెస్ తరువాత కూడా వరుణ్ కు ఎక్కువగా క్లాస్ మరియు రొమాంటిక్ టైపు సినిమా కథలే వస్తున్నాయని, 

ఇక ప్రస్తుతం ఆయన నటిస్తున్న ఈ కొత్త సినిమా కూడా మంచి కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాగా తెరకెక్కుతోందని, ఒక పెద్ద మాస్ హిట్ కొట్టిన వరుణ్ కు, ఈ తదుపరి సినిమా ఎంతటి విజయాన్ని అందిస్తుందో అని లోలోపల ఆయన ఫ్యామిలిలో కొంత ఆందోళన అయితే ఉందట. అయితే కెరీర్లో ఏ హీరో కూడా అన్నీ మాస్ సినిమాలే చేయలేడని, తన వద్దకు వచ్చిన మంచి కథలను ఎంచుకుని, అవి మాస్ మరియు క్లాస్ అని చూడకుండా ముందుకు సాగితే తప్పకుండా మంచి విజయాలు దక్కే అవకాశం ఉందని అంటున్నారు సినీ విశ్లేషకులు. మరి అది వరుణ్ విషయంలో ఎంతవరకు జరుగుతుందో చూడాలి....!! 


మరింత సమాచారం తెలుసుకోండి: