మెగాస్టార్ చిరంజీవి... ఇండస్ట్రీకి ఒక సాదాసీదా నటుడిగా ఎంట్రీ ఇచ్చి... సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా... తనదైన స్టైల్ నటన తో అంచెలంచెలుగా ఎదుగుతూ ఎంతో ప్రేక్షకాదరణ పొందాడు చిరంజీవి. ఇక కొణిదెల శివశంకర ప్రసాద్ అని ఉన్న తన పేరును చిరంజీవి గా మార్చుకొని... ప్రేక్షకులందరికీ మెగాస్టార్ గా నిలిచారు. అయితే చిరంజీవి సినీ కెరీర్లో ఎన్నో అద్భుతమైన విజయాలు సొంతం చేసుకున్నారు. ఎన్నో అవార్డులు అందుకున్నారు. అయితే ఇప్పటివరకు చిరంజీవి నటించిన ఎన్నో సినిమాలకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నిర్వహించే నంది అవార్డుతో పాటు ఫిలింఫేర్ పురస్కారాలు కూడా ఎన్నో గెలుచుకున్నారు. కానీ చిరంజీవి సినీ కెరీర్లో ఇప్పటివరకు ఒక్క జాతీయ పురస్కారం కూడా అందుకోలేదు. 

 

 

 

 

 కాగా తాజాగా అక్టోబర్ 2 న విడుదలైన సైరా నరసింహారెడ్డి సినిమా మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. తొలి తెలుగు స్వతంత్ర సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో... మెగాస్టార్ చిరంజీవి 41 ఏళ్ల సినీ కెరియర్ లోనే మొదటి సారి ఒక చారిత్రాత్మక పాత్రల్లో నటించి తన నట విశ్వరూపం చూపించారు మెగాస్టార్ చిరంజీవి. అయితే ఈ సినిమాలో తన నటనకు ఎన్నో ప్రశంసలు అందుకున్నారు చిరంజీవి. అంతేకాకుండా చిరంజీవి సినీ కెరియర్ లోనే సైరా నరసింహారెడ్డి సినిమా బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అయితే చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్ గా  తెరకెక్కిన సైరా నరసింహారెడ్డి సినిమా తో... చిరంజీవి జాతీయ  ఉత్తమ నటుడి అవార్డు అందుకోవాలని అభిమానులు భావిస్తున్నారు.

 

 

 

 

 సైరా నరసింహారెడ్డి సినిమా లో తన నట విశ్వరూపం చూపించిన చిరంజీవి... ఈసారి ఎలాగైనా జాతీయ ఉత్తమ నటుడిగా ఎంపికై అవార్డు అందుకోవాలని మెగా అభిమానులు కోరికతో ఉన్నారు. అంతేకాకుండా మెగా బ్రదర్ నాగబాబు కూడా సైరా నరసింహారెడ్డి సినిమాతో తన అన్నయ్య చిరంజీవి సినీ జీవితంలో  చరిత్రాత్మక పాత్ర పోషించలేదు అన్న కోరిక తీర్చుకున్నాడు అని ఈ సినిమాతో అయినా .. అన్నయ్య చిరంజీవి కి జాతీయ ఉత్తమ నటుడు అవార్డు రావాలని కోరుకుంటున్నప్పుడు నాగబాబు చాలాసార్లు తెలిపాడు. మరి నాగబాబు అనుకుంటున్నట్లు నిజంగానే సైరా నరసింహారెడ్డి సినిమా లో చిరంజీవి నటనకు గాను ఉత్తమ జాతీయ నటుడు అవార్డు వస్తుందా లేదా చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: