సంక్రాంతి సనిమాల రేస్ ఫిక్స్ అయినప్పటికీ మధ్యలో హడావిడి చేస్తున్న ‘వెంకీ మామ’ మహేష్ బన్నీలకు కలవరపాటును సృష్టిస్తోంది అన్నవార్తలు వస్తున్నాయి. కొద్దిసేపు ‘వెంకీ మామ’ డిసెంబర్ లో వస్తుందనీ లేదంటే జనవరిలో సంక్రాంతికి వస్తుందని అంటూ ఈమూవీ నిర్మాతలు ఇస్తున్న లీకులు ఏకంగా టాప్ హీరోలు మహేష్ బన్నీలను కూడ కన్ఫ్యూజ్ చేస్తున్నట్లు టాక్. 

తెలుస్తున్న సమాచారం మేరకు ‘వెంకీ మామ’ నిర్మాతలు తమ సినిమాకు జనవరి 11న విడుదల అయితే తమకు ఎన్ని ధియేటర్లు దొరుకుతాయి అన్నసమాచారం సేకరించడం బట్టి ‘వెంకీ మామ’ ఆలోచనలు ఇంకా సంక్రాంతి చుట్టూ తిరుగుతున్నాయా అంటూ ఏకంగా మహేష్ బన్నీలు కూడ టెన్షన్ పడుతున్నట్లు టాక్. అంతేకాదు ‘ఎఫ్ 2’ సెంటిమెంట్ మళ్ళీ రానున్న సంక్రాంతికి కూడ వర్తిస్తుందా అంటూ మరికొందరు కామెంట్ చేయడం ఈ కన్ఫ్యూజ్ చేస్తుంది.

ఇది ఇలా ఉంటే ‘వెంకీ మామ’ వల్ల జరగబోయే కన్ఫ్యూజన్ ను గుర్తించిన మహేష్ అల్లు అర్జున్ లకు సన్నిహితులైన కొంతమంది నిర్మాతలు ఈమూవీ నిర్మాత సురేశ్ బాబు వద్దకు వెళ్ళి ‘వెంకీ మామ’ ను డిసెంబర్ 20న విడుదల చేసుకోమని కోరినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈమూవీ సోలో రిలీజ్ గా అయ్యేందుకు తాము సహకరించి ఈ డేట్ కు విడుదల కాబోతున్న మిగతాసినిమాలు అన్నీ విడుదల కాకుండా తాము సహకరిస్తాము అని చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. 
   
డిసెంబర్ 20న విడుదల అవ్వడానికి ప్రయత్నిస్తున్న ‘96’ ‘డిస్కోరాజా’ ‘భీష్మ’ సినిమాలు జనవరి చివరకు వాయిదా పడే విధంగా తాము చూస్తామని ఆనిర్మాతలు సురేశ్ బాబుకు చెప్పినట్లు టాక్. అయితే అదే డేట్ ను టార్గెట్ చేస్తూ విడుదలకాబోతున్న బాలయ్య కె.ఎస్. రవికుమార్ ల సినిమా పరిస్థితి ఏమిటి అంటూ సురేశ్ బాబు ఆనిర్మాతలను ప్రశ్నించినప్పుడు బాలయ్యకు సద్దిచెప్పడం తమ వల్లకాదు అని చెప్పినట్లు టాక్. బాలయ్య సహకరించి డిసెంబర్ రేస్ నుండి తప్పుకుంటే ‘వెంకీ మామ’ సోలో రిలీజ్ గా డిసెంబర్ 20న బాలయ్య తప్పుకోకుంటే ఎన్ని సినిమాల పోటీ ఉన్నా జనవరి 11న ‘వెంకీ మామ’ వస్తుంది అని ఇస్తున్న లీకులు డిసెంబర్ లో విడుదల కావలసిన సినిమాలతో పాటు సంక్రాంతి సినిమాలను కూడ కన్ఫ్యూజ్ చేస్తున్నట్లు టాక్.. 


మరింత సమాచారం తెలుసుకోండి: