స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ "అల వైకుంఠపురములో" సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీన రిలీజ్ కానుందని ప్రకటించారు.  త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. అయితే గత కొన్ని రోజులుగా అల్లు అర్జున్ కొత్త నిర్మాణ సంస్థని స్టార్ట్ చేస్తున్నాడనే వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో నిర్మాణ సంస్థ కోసం రైటర్స్ ని సైతం నియమించుకుని కథలు వింటున్నాడనే ప్రచారం జరిగింది.


ఇలాంటి వదంతులు వస్తున్న నేపథ్యంలో అల్లు అర్జున తన సినిమాలో గీతా ఆర్ట్స్ ని భాగం చేసి వదంతులకు ఫుల్ స్టాప్ పెట్టాడు. "అల వైకుంఠపురములో" సినిమాకి నిర్మాణంలో గీతా ఆర్ట్స్ ని భాగస్వామ్యం చేసింది అల్లు అర్జునే. అయితే అల్లు అర్జున గీతా ఆర్ట్స్ ని టేకోవర్ చేయనున్నాడని సమాచారం. ఇంతకుముందు అల్లు శిరీష్ గీతా ఆర్ట్స్ బాధ్యతలని చూసుకుంటాడని అనుకున్నారు. కానీ శిరీష్ హీరోగా సెటిల్ అవ్వాలని అనుకోవడంతో ఆ బాధ్యతల నుండి తప్పుకున్నాడట.


ఇక అల్లు అర్జున్  అన్నయ్య బాబి కూడా నిర్మాణ రంగంలోకి దిగాడు. ఆయన వరుణ్ తేజ్ తో ఒక సినిమా మొదలెట్టేశాడు. ఇక ఇప్పుడు గీతా ఆర్ట్స్ ని చూసుకునే బాధ్యత అల్లు అర్జున్ పై పడింది. అంతే కాదు రామ్ చరణ్, ప్రభాస్, మహేష్ లాంటి స్టార్లు నిర్మాణ రంగంలోకి దిగుతుండడంతో తనకి కూడా ఒక సొంత నిర్మాణ సంస్థ ఉంటే బాగుంటుందని అనుకుంటున్నాడట. ఇక నుండి తను చేసే ప్రతీ సినిమాలో గీతా ఆర్ట్స్ ని భాగం చేస్తాడట.


ఈ విధంగా గీతా ఆర్ట్స్ ని టేకోవర్ చేయనున్నాడని సమాచారం.  తన స్నేహితుడు బన్నీ వాసుతో కలిసి నిర్మాణ బాధ్యతలని చూసుకుంటాడట.



మరింత సమాచారం తెలుసుకోండి: