బిగ్ బాస్ 3 రోజు రోజు కి ఇంటి సభ్యుల మద్య కాంపిటీషన్ బాగా పెరిగిపోతుంది.  విజయానికి కొద్ది దూరంలో ఉన్నారని నాగార్జున ఇంటి సభ్యులకు హింట్ ఇవ్వడంతో ఎవరికి వారే తమ గెలుపు కోసం నానా కష్టాలు పడుతున్నారు.  మొన్నటి వరకు ఒకరికి ఒకరు సహాయంగా ఉన్నవారు..ఇప్పుడు ఎవరి గేమ్ వారు ప్లే చేస్తున్నారు.  మొన్నటి ఎపిసోడ్ లో శివజ్యోతి చేసిన  ప‌నికి ఇంటి స‌భ్యులు అంద‌రు నామినేష‌న్‌కి వెళ్లిన సంగ‌తి తెలిసిందే. 87వ ఎపిసోడ్‌లో ఇదే విష‌యంపై గ్రూపులుగా చ‌ర్చ‌లు జ‌రిపారు. మంగళవారం ఎపిసోడ్ లో కూడా ఆ హీట్ కంటిన్యూ అయింది.


హౌస్ మేట్స్ అందరూ నామినేట్ కావడానికి కారణమైన వరుణ్, శివజ్యోతిలు ఈ ఎపిసోడ్ లో కూడా వాదించుకున్నారు. నువ్వు నాకు వార్నింగ్ ఇచ్చావ‌ని వ‌రుణ్ శివ‌జ్యోతిపై మండిప‌డ్డాడు. ఇంతలో వితికా వచ్చి వరుణ్ ని కూల్ చేసే ప్రయత్నం చేసింది. మొన్న‌టి వ‌ర‌కు వ‌రుణ్ గ్యాంగ్‌లో ఉన్న రాహుల్.. శివ‌జ్యోతి, అలీ తో జ‌త క‌ట్టి వితికా, వ‌రుణ్‌ల మ‌న‌స్త‌త్వాల గురించి వివ‌రించాడు. ఇక వితికా, వ‌రుణ్‌లు.. శివ‌జ్యోతి అన్న మాట‌ల‌ని కొద్ది సేపు బాబా భాస్క‌ర్ ద‌గ్గ‌ర చ‌ర్చించారు.   ఇక వ‌రుణ్ త‌న‌ని కంత్రీ, ఓవర్ యాక్టింగ్ అని అన‌డంపై ఎమోష‌నల్ అయిన శివ‌జ్యోతి క‌న్నీరు పెట్టుకుంది. అనంతరం బిగ్ బాస్ ఇంటి స‌భ్యుల‌కి బిగ్ బాస్ హోట‌ల్ టాస్క్ ఇచ్చారు. 


ఈ టాస్క్ లో పార్టిసిపేట్ చేస్తున్న కంటెస్టెంట్స్ కదలకుండా, మెదలకుండా, ఉన్నవాళ్లు ఉన్న చోట పడుకోవడం, మ్యూజిక్ వచ్చినప్పుడు డాన్స్ చేయడం వంటివి చేయాలి. ఈ టాస్క్ మధ్యలో ఇంటిలోకి కంటెస్టెంట్స్ రిలేటివ్స్ ని పంపించారు. ముందుగా వితికా చెల్లెలు హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. బిగ్ బాస్ రిలీజ్ అన్న త‌ర్వాత ఇంటి స‌భ్యులు అందరు రితికాతో స‌ర‌దాగా టైం స్పెంట్‌ చేశారు. వెళ్ళేముందు రితికా హోట‌ల్‌కి వ‌న్ స్టార్ రేటింగ్ ఇచ్చింది. ఇక ఎపిసోడ్ చివ‌ర‌లో అలీ భార్య మ‌సుమ హౌజ్‌లోకి అడుగు పెట్టింది. ఇక నేటి ఎపిసోడ్‌లో శివ‌జ్యోతి భ‌ర్త గంగూలీతో పాటు మిగ‌తా హౌజ్ మేట్స్ కుటుంబ స‌భ్యులు కూడా బిగ్ బాస్ హోట‌ల్‌లోకి అడుగుపెట్ట‌నున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: