తెలుగులో స్టైల్ కి కేరాఫ్ అంటే అడ్రస్ అంటే అందరు అల్లు వారబ్బాయి అల్లఅర్జున్ పై మనసుపారేసుకుంటారు. స్టయిలే కాదు, డ్యాన్స్, కామెడీ రొమాన్స్ ఇలా ఒకటేంటి అయన గురించిన చెప్పాలంటే మరో చిరంజీవి అని చాలా అంది అంటుంటారు. చైల్డ్ ఆర్టిస్టుగా సినిమాలలోకి ఎంటర్ అయినా కూడా గంగోత్రి సినిమాతో హీరోగా అడుగెట్టాడు. అప్పటి నుండి ఇప్పటికీ చాలా సినిమాలలో నటించారు చాలా సినిమాలలో బన్నీ తన గ్రేడ్ మార్కుతో రాణించారు. 


ఇకపోతే బన్నీ నాపేరు సూర్య.. నా ఇల్లు ఇండియా సినిమా తరువాత చాలా గ్యాప్ తీసుకొని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబోలో అలవైకుంఠపురములో సినిమాలో నటిస్తున్నారు ఆ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తయింది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ప్రస్తుతం బన్నీ గురించి ఓ వార్త అందరి నోట్లో నానుతుంది. 


షూటింగ్ లొకేషన్ కి వెళ్ళాక బన్నీ చేసే పని ఒకటే కనిపించిన వారందరికీ చిన్న, పెద్ద అని తేడా లేకుండా అందరికి విష్ చేస్తాడు. ఆ ఫోటో ఒకటి నెట్టింట్లో తిరుగుతుంది. దానితో బన్నీ ఫ్యాన్స్ దట్ ఈజ్ బన్నీ అన్న అంటూ తెగ పొగడ్తలతో ముంచేస్తున్నారంటే నమ్మండి. ఎంత పెద్ద స్టార్ అనేది మనిషికి అంతేగాని గాని మనసుకు కాదు అంటూ అందరు అయన వ్యక్తిత్వానికి ఫిదా అవుతున్నారు. 


త్రివిక్రమ్, బన్నీ కాంబోలో గతంలో వచ్చిన సినిమాలు జులాయి, సన్ అఫ్ సత్య మూర్తి సినిమాలు బాక్సాఫీస్ వద్ద రికార్డులను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.. ప్రస్తుతం మూడో సినిమాగా అలవైకుంఠపురములో సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో బన్నీకి జోడిగా పూజాహెగ్డే నటిస్తుంది. ప్రత్యేక పాత్రలో కాజల్ కూడా ఇందులో నటిస్తుంది. టబు వంటి సీనియర్ నటులు ఈ సినిమాలో నటిస్తున్నారు. జనవరి 12  లో ఈ సినిమా విడుదల కానుంది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: