ఎన్టీఆర్ బయోపిక్ సినిమాలను తెరకెక్కించిన సినిమాలు అతి పెద్ద డిజాస్టర్స్ గా మారడంతో ఆ సినిమాలకు కొచం దూరం ఉన్నారు బాలయ్య.. ఇకపోతే అయన 105 వ సినిమాగా మరో సినిమా రాబోతుంది ఆ సినిమాలో బాలయ్య కొత్తగా కనిపిస్తున్నాడు. స్లిమ్ లుక్ లో ఉన్న బాలయ్య కొత్త ఎనేర్జి తో సినిమా తీయబోతున్నాడు.ఆ సినిమాలో బాలయ్య మన్మథుడు లాగ కనిపిస్తున్నాడు. 


దర్శకుడు కె.ఎస్.రవికుమార్ కాంబినేషన్‌లో రెండో సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగం తో జరుపుకుంటుంది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే చాలా పోస్టర్స్ రిలీజ్ అయినా విషయం తెలిసిందే.. ఆ పోస్టర్స్ లో బాలయ్య లుక్ నందమూరి ఫ్యాన్స్ అనడాన్ని వ్యక్తం చేస్తున్నారు. అలా సినిమాలో కొన్ని సన్నీ వేశాలు కూడా బయటకొచ్చాయి. 


సినిమా షూట్ అయితే జరుపుకొంటుంది గాని పాపం ఈ సినిమాకు పేరు మాత్రం పెట్టలేదు. కానీ,  సినిమా మాత్రం రొమాన్స్ జోనర్ లో కొత్తగా బాలయ్య రాబోతున్నాడని వార్త నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. టైటిల్ ను దసరా సందర్బంగా పేరు పెట్టాలనుకొని ఆ చిత్ర యూనిట్ వెల్లడించింది. దానికి కారణాలు లేకుండా పేరు పెట్టలేదు. 


ఇది ఇలా ఉండగా ఈ సినిమా టైటిల్ ఇదే అంటూ ఓ ప్రముఖ ఛానెల్ అయిన  జెమినీ టీవీ సినిమా టైటిల్ ఇదేనని వెల్లడించింది. మొదట ‘రూలర్’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్టు టాక్. ఆ తరవాత ‘క్రాంతి’, ‘జడ్జిమెంట్’, ‘డిపార్ట్‌మెంట్’ పేర్లు కూడా బయటకు వినపడుతున్నాయి. కానీ, మొదట వినిపించిన టైటిల్‌నే ఖరారు చేసినట్టు సమాచారం. మరి ఆ విషయం ఓ కొల్కి రాక ముందే జెమినీ టీవీ వెల్లడించడంతో ఆ వార్త వైరల్ అవుతుంది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: