మీ టూ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఇదో హాట్ టాపిక్. కానీ ఈ మీటూ గొడవ రాకముందు కూడా చాలామంది సినీరంగంలోని కామాంధుల లీలలు ధైర్యంగా బయటపెట్టారు. ఇలాంటి వివాదాలా టాలీవుడ్ లోనూ వెలుగు చూశాయి. కానీ పాపం.. ఓ డైరెక్టర్ కు ఏమాత్రం సంబంధం లేకుండా ఇలాంటి ఓ విషయంలో అల్లరిపాలయ్యాడట.


ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరో తెలుసా.. రవిబాబు.. అవును.. థ్రిల్లర్ మూవీస్ ఎక్కువగా తీసే రవిబాబు కూడా ఇలాంటి వివాదంలో చిక్కుకున్నానని చెబుతూ ఆ వివరాలు ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు.. ఆయనకు అసలు సోషల్‌మీడియా అకౌంట్లే లేవట. ఆయన పేరుతో ఉన్నవన్నీ నకిలీవేనట... అందులో ఓ ఫేక్ ఎకౌంట్ నుంచి గతంలో రవిబాబుతో కలసి పనిచేసిన ఓ లేడీ ఆర్టిస్టుకు బూతు మెస్సేజులు వచ్చాయట.


అంటే రవిబాబు పేరును ఆ కామాంధుడు వాడుకున్నాడన్నమాట. కానీ ఈ విషయం తెలియని సదరు లేడీ ఆర్టిస్టు.. రవిబాబుపై కోపం పెంచుకుందట. ఏకంగా ఓ ఛానల్ కు వెళ్లిందట. ఆ ఛానల్ వాళ్లు కూడా ఆ ఛాటింగ్ రవిబాబే చేసి ఉంటారనుకుని రవిబాబుపై నెగిటివ్ స్టోరీ వేశారట. ఆ విషయం తన అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ద్వారా తెలుసుకున్న రవిబాబు.. ఆ జర్నలిస్ట్‌కి ఫోన్‌ చేసి ‘అది నా ఫేస్‌బుక్‌ అకౌంటో కాదో తెలియకుండా ఎలా మాట్లాడతారు’ అని అడిగాడట.


ఆ తర్వాత విషయం తెలసుకున్న సదరు ఛానల్ వాళ్లు ఆ ప్రచారం ఆపేశారట. సాధారణంగా అయితే, వాళ్లపై చర్యలు తీసుకోవాలి.. కానీ నేను అవన్నీ పట్టించుకోను వదిలేశాను అంటున్నారు రవిబాబు. అందుకే తాను సోషల్ మీడియా జోలికి వెళ్లనని రవిబాబు ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. సోషల్ మీడియాలో వచ్చే వాటిల్లో చాలా వరకూ ఫేక్ వే ఉంటాయని అంటున్నారాయన.


మరింత సమాచారం తెలుసుకోండి: