ఎన్టీఆర్ బయోపిక్ కి సంబంధించిన రెండు సినిమాలు ఫ్లాప్ అయిన తర్వాత రాజకీయాలలో బిజీబిజీగా గడిపిన తర్వాత కె.ఎస్.రవికుమార్ దర్శకత్వం లో సినిమా మొదలు పెట్టిన బాలయ్య బాబు ఆ సినిమాలో అదిరిపోయే గెటప్ వేయడం జరిగింది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి పిక్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. బాలకృష్ణ లేటెస్ట్ తెలుగు చూసి చాలామంది నందమూరి అభిమానులు పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబందించిన షూటింగ్ ఎక్కడా కూడా విరామం లేకుండా జరుగుతున్న క్రమంలో సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో అని ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు నందమూరి ఫ్యాన్స్.


ఇటువంటి నేపథ్యంలో ఈ సినిమాకి ఇంకా టైటిల్ కూడా ఖరారు కాని క్రమం లో రోజుకో టైటిల్ మార్కెట్లో ,మీడియాలో వినపడుతోంది. అయితే ప్రముఖ టీవి ఛానెల్ జెమినీవారు అత్యుత్సాహంతో ఈ సినిమా టైటిల్ ని లీక్ చేసేసారు. వివరాల్లోకి వెళితే... నిర్మాతలు ఈ సినిమాకు సంబంధించిన బిజినెస్ డీల్స్ కి పూర్తి చేస్తున్నారు. రీసెంట్ గా శాటిలైట్ హక్కులను ప్రముఖ తెలుగు ఛానెల్ జెమిని టీవీ కు ఫ్యాన్సీ రేటుకు ఇచ్చేసారు.


వారు ఈ సినిమాకు రూలర్ అనే  టైటిల్ పెట్టారని ప్రకటిస్తూ సోషల్ మీడియాలో ట్వీట్ చేసారు. ఈ సినిమా హక్కుల్ని అందుకున్నట్లు బాలక్రిష్ణ – సోనాల్ చౌహన్ కి సంబంధించిన లుక్ ని రిలీజ్ చేశారు. అయితే సినిమా యూనిట్ ఇంకా టైటిల్ అధికారికంగా ప్రకటించలేదు దీంతో సస్పెన్స్ గా ఫ్యాన్స్ కి టైటిల్ ప్రకటించాలని చూసిన బాలకృష్ణకి జెమిని న్యూస్ ఛానల్ ఒక్కసారిగా షాక్ హెచ్డి ముందే ప్రకటించడంతో సదరు చానల్ పై మరియు సినిమా యూనిట్ పై బాలకృష్ణ మండిపడినట్లు సమాచారం. 



మరింత సమాచారం తెలుసుకోండి: