సినిమా ప్రమోషన్స్ కు స్టార్ ఇమేజ్ బాగా యూజ్ అవుతుంది. ముఖ్యంగా చిన్న సినిమాలను స్టార్ ప్రమోషన్స్ మంచి బూస్టింగ్ అని చెప్పొచ్చు. అందుకే సాధ్యమైనంత వరకు ఏ చిన్న సినిమా టీజర్, ట్రైలర్ ఇలా ఈవెంట్ ఏదైనా స్టార్స్ తో రిలీజ్ చేయిస్తారు. అయితే ఆల్రెడీ తానొక స్టార్ అయినా సరే విజయ్ దేవరకొండ తన సినిమాను మరో స్టార్ తో రిలీజ్ చేయిస్తాడు.


ఇది తను హీరోగా వచ్చే సినిమా కాదు నిర్మాతగా మారి చేసిన మొదటి సినిమా అందుకే తనకన్నా పెద్ద స్టార్ తో ప్రమోట్ చేయాలని భావించాడు. అనుకున్నట్టుగానే సూపర్ స్టార్ మహేష్ తో ఆ సినిమా ట్రైలర్ రిలీజ్ చేయిస్తున్నాడు. విజయ్ దేవరకొండ నిర్మాతగా తరుణ్ భాస్కర్ హీరోగా వస్తున్న సినిమా మీకు మాత్రమే చెబుతా.


షమీర్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో అవంతిక మిశ్రా హీరోయిన్ గా నటించింది. సినిమాలో అనసూయ కూడా స్పెషల్ రోల్ చేసింది. ఈ సినిమా ప్రమోషన్స్ కు మహేష్ ను ఫుల్లుగా వాడేస్తున్నాడు విజయ్ దేవరకొండ. హీరోగా విజయ్ ఎదిగిన తీరుని మహేష్ ఎప్పుడూ మెచ్చుకుంటాడు. అందుకే విజయ్ సొంతంగా నిర్మిస్తున్న సినిమాకు తన సపోర్ట్ ఇస్తున్నాడు మహేష్.


ఈరోజు సాయంత్రం 4:30 గంటలకు మీకు మాత్రమే చెప్తా ట్రైలర్ రాబోతుంది. మొన్నీమధ్య వచ్చిన టీజర్ మెప్పించగా సినిమా కూడా ఆద్యంతంఆకట్టుకునేలా ఉంటుందని తెలుస్తుంది. ఓ పక్క హీరోగా మంచి క్రేజ్ సంపాదిస్తూనే నిర్మాతగా యంగ్ టాలెంటెడ్ గాయ్స్ ను ఎంకరేజ్ చేస్తునాడు విజయ్ దేవరకొండ. విజయ్ మాత్రమే కాదు మహేష్ కూడా తన సొంత ప్రొడక్షన్ స్టార్ట్ చేశాడని తెలిసిందే. ఎం.బి ప్రొడక్షన్స్ లో అడివి శేష్ హీరోగా మేజర్ సినిమా వస్తుంది.   


మరింత సమాచారం తెలుసుకోండి: