తమిళంలో రజనీకాంత్ కమల్ హాసన్ తర్వాత ఆ రేంజ్ లో ఇమేజ్ సంపాదించుకున్నారు విజయ్ అజిత్ లు. వీళ్ళతో సినిమాలు చేయాలని తమిళ నిర్మాతలు దర్శకులు హీరోయిన్లు అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వీళ్ళతో సినిమాలు చూస్తే అటు పేరుతొ పాటు ఇటు డబ్బు కూడా సంపాదించొచ్చు అని నిర్మాతలు ఈ హీరోల ఇళ్ల ముందు సూట్ కేసులు పట్టుకుని మరీ నిల్చుంటారు. తాజాగా విజయ్ హీరోగా నటిస్తున్న సినిమా 'బిగిల్' ట్రైలర్ రిలీజ్ అయ్యి రికార్డ్స్ బద్దలు గొడుతూ యూట్యూబ్ టెండింగ్ లో నిలిచింది.
 
ఈ సినిమాని నిర్మిస్తున్న అర్చన కళాపది హీరో విజయ్ పై కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఈ సినిమాకి దాదాపుగా 180కోట్లు ఖర్చు చేశానని చెప్పింది. 180 కోట్లతో సినిమా చేయాలంటే ఎవరైనా కొంచెం ఆలోచిస్తారని అయితే తాను విజయ్ మీద ఉన్న నమ్మకంతో ఈ సినిమాకు ఎంతైనా ఖర్చు చేయాలని అనుకున్నానని చెప్పింది. తమిళ సినీ పరిశ్రమలో ఎంత ఖర్చు పెట్టి సినిమా తీసినా ఆ డబ్బులు తిరిగి సంపాదించే స్టామినా విజయ్ సినిమాలకు మాత్రమే ఉందని ఆమె అంటుంది.

ఈ సినిమాను దర్శకుడు అట్లీ నిర్మిస్తుండడంతో ఈ సినిమాపై అంచనాలు బాగా పెరిగిపోయాయి. ఇంతకుముందు విజయ్ అట్లీ కాంబినేషన్ లో వచ్చిన 'మెర్సల్' సినిమా తమిళంలో చాలా పెద్ద హిట్ అయ్యింది.

దాంతో ఈ సినిమా కూడా అంతకంటే పెద్ద హిట్ అవుతుందని అక్కడి అభిమానులు ఈ సినిమా విడుదల కోసం ఎదురుచూస్తున్నారు.అయితే బిగిల్ కి పోటీగ కార్తీ నటించిన ఖైతి సినిమా కూడా దీపావళి కానుకగా రానున్నది . ఈ సినిమా పై కూడా కోలీవుడ్ మంచి అంచనాలు ఉన్నాయి చూడాలి బిగిల్ ఎంత మేరకు లాభాలు తెస్తుందో .



మరింత సమాచారం తెలుసుకోండి: