ఈ మధ్య మన తెలుగు డైరెక్టర్ .మాటల  మాంత్రికుడు  త్రివిక్రమ్ ప్రతి సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ కామన్ గా కనిపిస్తున్నారు. 'అత్తారింటికి దారేది' నుండి మొన్నొచ్చిన 'అరవింద సమేత' వరకూ త్రివిక్రమ్ సినిమాలో రెండో హీరోయిన్ కామన్. అయితే 'అత్తారింటికి దారేది' 'సన్ ఆఫ్ సత్య మూర్తి''అ' సినిమాలో ప్రణీత అదా శర్మ అనుపమలకు మంచి స్కోప్ ఉన్న క్యారెక్టర్ ఇచ్చిన త్రివిక్రమ్ 'అరవింద సమేత' మాత్రం ఈషా ను జస్ట్ రెండు మూడు సీన్స్ కె పరిమితం చేసాడు.

నిజంగా చెప్పాలంటే సినిమాలో ఈషా జస్ట్ గెస్ట్ రోల్ అనిపించుకుంది. ఇప్పుడు 'అల వైకుంఠపురములో' సినిమాలో  పూజా హెగ్డే మెయిన్ హీరోయిన్ గా కనిపించనుండగా  నివేత పెతురాజ్ సెకండ్ లీడ్ లో కనిపించనుంది

. అయితే ఇంత వరకూ నివేత క్యారెక్టర్ ఏంటనేది బయటికి రాకపోవడంతో అసలు సినిమాలో నివేత కి గురూజీ స్కోప్ ఉండే క్యారెక్టర్ ఇచ్చాడా లేదా అనే అనుమానాలు మొదలయ్యాయి. నిజానికి నివేత తెలుగులో తక్కువ సినిమాలే చేసినా హైలైట్ అయ్యే క్యారెక్టర్స్ చేసింది. లేటెస్ట్ గా చిత్రలహరి లో కూడా ఆమె పాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఇంకా టీజర్ రిలీజ్ కాలేదు కాబట్టి నివేత క్యారెక్టర్ ఏంటో కథలో ఆమెకి స్కోప్ ఉందా లేదా  అన్నది కూడా తెలియలేదు. సో టీజర్ లోనో లేదా ఏదైనా క్యారెక్టర్ పోస్టర్ లోనూ నివేత గురించి చెప్తే తప్ప సినిమాలో ఆమెను ఎందుకు తీసుకున్నారనే విషయం బయటికి రాదు. మరి ఈ విషయంపై త్రివిక్రమ్ క్లారిటీ ఇచ్చేదేప్పుడో ?    లేదా సంక్రాంతి కానుకగా డుదల కానున్న  రోజు ఒక క్లారిటీ వస్తుందేమో వేచి చూడాలి మరి?           .


మరింత సమాచారం తెలుసుకోండి: