స్టార్ హీరో లు నటించిన సినిమాలే  100కోట్లు  రాబట్టాలంటే  హిట్ టాక్ తో పాటు ప్రమోషన్స్  కూడా చాలా అవసరం. అలాంటింది  ఇటీవల విడుదలైన  ఓ సినిమా ప్రమోషన్స్ ఏమి లేకుండా  సైలెంట్ గా విడుదలై  100కోట్ల క్లబ్ లో చేరి ఈ ఏడాది బిగ్గెస్ట్  బ్లాక్ బాస్టర్ అనిపించుకుంది.  ఇంతకీ ఆ సినిమా ఏంటంటే ... తమిళ హీరో ధనుష్ నటించిన  అసురన్.  ఇటీవల విడుదలైన ఈ చిత్రం  సూపర్  పాజిటివ్ టాక్ తో ప్రపంచ వ్యాప్తంగా  60కోట్ల వసూళ్లను రాబట్టింది.  థియేట్రికల్ కలెక్షన్స్ తోపాటు  నాన్ థియేట్రికల్  రూపంలో  మరో 40కోట్ల బిజినెస్ చేసింది. అలా అసురన్ 100కోట్ల వసూళ్లను రాబట్టింది. 



ఇంతకుముందు  తుపాకి, కాకా కాక ,తెరి , వంటి బ్లాక్ బాస్టర్  సినిమాలు  నిర్మించిన కూడా  అసురన్ తో వచ్చిన  లాభాలు ఏ సినిమా తో రాలేదని స్వయంగా  నిర్మాత  కలైపులి ఎస్ థాను  వెల్లడించాడంటే ఈ చిత్రం ఏ రేంజ్ లో లాభాలను  తీసుకొచ్చిందో అర్ధం చేసుకోవచ్చు. లో బడ్జెట్ లో తెరకెక్కిన ఈ చిత్రం ధనుష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచింది.  రూరల్ బ్యాక్ డ్రాప్ లో రివేంజ్ డ్రామా గా తెరకెక్కిన ఈ చిత్రంలో ధనుష్ నటన  హైలైట్ గా నిలిచింది.  వెట్రిమారన్ డైరెక్ట్ చేసిన  ఈ చిత్రంలో మలయాళ నటి  మంజు వారియర్ ,ధనుష్ కు జోడీగా నటించగా జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందించాడు.   కాగా  ధనుష్ - వెట్రిమారన్ కాంబినేషన్ లో ఇది రెండో సినిమా. ఇంతకుముందు  వీరి కాంబినేషన్ లో వచ్చిన  వడ చెన్నై కూడా బ్లాక్ బాస్టర్ హిట్ అనిపించుకుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: