అగ్ర కథానాయికలు తమ రెమ్యునరేషన్‌ను అమాంతం పెంచేస్తూ వస్తున్నారని,ఈ విషయంపై  స్పందిస్తూ నటి ప్రియమణి కామెంట్ చేశారు. ఒక సినిమా హిట్టవగానే  రెమ్యునరేషన్ భారీగా డిమాండ్ చేసేస్తున్నారు  హీరో, హీరోయిన్లు. మొదటినుండి హీరోల పారితోషికం ఎప్పుడూ హీరోయిన్ల కన్నా ఎక్కువే ఉంటుంది అని పేర్కొన్నారు. ఇదివరకు  హీరోయిన్స్‌ నోరు తెరిచి అడిగే ధైర్యం కూడా ఉండేది కాదని కూడా అన్నారు. 


 ప్రస్తుతం అగ్ర కథానాయికలుగా రాణిస్తున్న సమంత, నయనతార, అనుష్క శెట్టి మాత్రమే వాళ్ళ, స్థాయికి తగట్టు రెమ్యునరేషన్ తీసుకొంటున్నారు అని,తాజాగా  జాతీయ అవార్డు గ్రహీత అయిన ప్రియమణి మీడియా ముందు స్పందించారు. వారికి దక్కాల్సిన పారితోషికం దక్కుతోందని హర్షం వ్యక్తం చేశారు. ఇదివరకు ఉన్న నటీమణుల పరిస్థితి వేరుగా ఉండేది. వారికి కావాల్సింది ,నోరు తెరిచి అడిగే పరిస్థితే లేదు.ఇప్పుడు అలా కాదు,వారి అర్హతకు,క్యారెక్టర్ తగ్గట్టు రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నారు. అందుకు నేను చాలా సంతోషిస్తున్నాను.

ఇండస్ట్రీలో చాలా మార్పులు వచ్చాయని ఆమె చెప్పారు.నయనతార, సమంత, అనుష్కలే  ఇందుకు ఉదాహరణలు  అన్నారు. ముస్తఫాతో పెళ్లయ్యాక ప్రియయణి సినిమాల్లో నటించటం బాగా తగ్గించారు.కేవలం కొన్ని డాన్స్ షోస్ లో జడ్జిగా కనిపించరు చాలాకాలం. ఇటీవల ‘ఫ్యామిలీ మ్యాన్’ అనే వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు  వచ్చి మెప్పించారు. ఈ వెబ్ సిరీస్ మంచి సక్సెస్  కూడా సాధించింది. ప్రస్తుతం ఈటీవీ లో వస్తున్నా  ఢీ డ్యాన్స్  రియాల్టీ షోకు జడ్జ్‌గా వ్యవహరిస్తూ  అటు విరాట పర్వం అనే సినిమాలో ఓ కీలక పాత్రను కూడా  పోషిస్తున్నారు. 


మొన్న ఇండస్ట్రీని షేక్ చేసిన మీటూ ఉద్యమం గురించి మాట్లాడుతూ,ఇండస్ట్రీకి చెందిన నటీమణులు తమ అభిప్రాయాలను ధైర్యంగా చెప్పటం చూసి తాను  ఎంతో గర్వపడ్డాను అని,ఈ లైంగిక వేధింపులు అనేవి కేవలం ఒక్క సినీ  పరిశ్రమలో మాత్రమే లేవు, అన్ని చోట్లా ఈ సమస్యని  ఆడవాళ్లు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు మీటూ చాలా పవర్‌ఫుల్ గా మారింది, కాబట్టి అమ్మాయిలను ఫ్లర్ట్ చేయడానికి కూడా  చాలా మంది భయపడుతున్నారు అని పేర్కొన్నారు ప్రియమణి.


మరింత సమాచారం తెలుసుకోండి: