కొరటాల శివ అనే సౌండ్ వినపడగానే మనకు గుర్తొచ్చేది వారి సినిమాలు,వారి రికార్డ్స్,వారి రైటింగ్ విధానం.అలాంటిది ఇప్పుడు మెగాస్టార్ తో మెగా ఫోన్ పట్టుకొనున్నాడట శివ. కమర్షియల్ హంగులతో కూడిన మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలు తీయడంలో దర్శకుడు కొరటాల శివ దిట్ట. ‘జనతా గ్యారేజ్’, ‘శ్రీమంతుడు’, ‘భరత్ అనే నేను’ సినిమాలే ఈ విషయాన్ని స్పష్టం చేసాయి. రచయిత నుంచి దర్శకుడిగా మారిన కొరటాల అనతికాలంలో స్టార్ డైరెక్టర్ హోదా సంపాదించారు. ఇప్పుడు ఆయన మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేస్తున్నారు. ఇటీవలే పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌పై రామ్ చరణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

అయితే, చిరంజీవితో తొలిసారి పనిచేస్తోన్న కొరటాల శివ ఎలాంటి కథను ఎంపిక చేసుకున్నారు అనే చర్చ ప్రస్తుతం సినీ పరిశ్రమలో మొదలైంది. ఈ చర్చలో భాగంగానే కథకు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు బయటికి వచ్చాయి. కొరటాల గత చిత్రాల మాదిరిగానే ఇది కూడా సోషల్ మెసేజ్‌తో కూడిన కమర్షియల్ సినిమా అట. ఈసారి శివ ‘ఆలయాలపై నిర్లక్ష్యం, వాటి వెనుక జరుగుతోన్న అవినీతి’ అనే కాన్సెప్ట్‌ను ఎంపిక చేసుకున్నారని టాక్.

ఆలయాలపై నిర్లక్ష్యం వహించడం, ఆలయ భూములను పక్కదారి పట్టించడం వల్ల దాని ప్రభావం సమాజంపై ఎలా ఉంటుంది, దీన్ని చక్కదిద్దడం కోసం హీరో ఏం చేశాడు వంటి అంశాలను సినిమాలో చూపించనున్నారని అంటున్నారు. దీంతో పాటు చిరంజీవి స్టైల్లో మసాలా ఎలిమెంట్స్‌కు కూడా కొదవ ఉండదు అని సమాచారం.అంతేకాదు, ఈ సినిమాలో చిరంజీవి దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉద్యోగి పాత్రలో కనిపిస్తారట. ఆలయాలపై నిర్లక్ష్యంగా వ్యవహరించి, ఆలయ భూములను అక్రమంగా కొట్టేసే రాజకీయ నాయకులపై చిరు పోరాడతారని ఇండస్ట్రీ వర్గాల ద్వారా తెలిసింది. మొత్తం మీద మెగాస్టార్ కోసం కొరటాల శివ మంచి కాన్సెప్ట్‌నే పట్టారు. అంతేకాదు, ఈ సినిమాలో విజయశాంతిని కూడా ఒక ముఖ్య పాత్ర కోసం తీసుకున్నారని టాక్ వినిపిస్తోంది.ఈ సినిమా కూడా హిట్ కొట్టి రాజమౌళి స్థాయికి చేరుకొనే గొప్ప అవకాశం అని ఫిల్మ్ నగర్ టాక్....

 

మరింత సమాచారం తెలుసుకోండి: