ప్రతిరోజూ పండగే మూవీలో నుండి ఇప్పటి వరకూ షూట్ చేసిన వివిధ భాగంలోని,అందమైన విజువల్స్‌తో ఒక షార్ట్ వీడియోని తయారుచేసి ,సాయి ధరమ్ తేజ్ పుట్టినరోజును పురష్కరించకుని ప్రేక్షకులకు కానుకగా అందించారు మూవీ యూనిట్. ఈ వీడియోని చూసిన వారంతా చాలా చూడముచ్చటగా ఉంది అని ,ముఖ్యంగా మెగా అభిమానులు మరియు సినిమా లవర్స్ అంటున్నారు.
దీనికి గ్లింప్స్ ఆఫ్ ‘ప్రతిరోజూ పండగే’ అని పేరు కూడా పెట్టారు. అద్భుతమయిన విజువల్స్‌తో ,ముఖ్యమయిన సీన్స్ ఉన్న ఒక్క షార్ట్ వీడియోను తయారుచేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. హీరో సాయి ధరమ్ తేజ్, సత్యరాజ్ కలిసి ఉన్న విజువల్స్ అయితే అదిరిపోయాయి అంటున్నారు నెటిజన్లు. అందమయిన పల్లెటూరి బ్యాక్‌డ్రాప్ తో,సత్యరాజ్ వేషధారణ అయిన పంచ కట్టుతో,ఇటు సాయి ధరమ్ తేజ్ లుక్స్ మరియు,రాశీ ఖన్నాల క్యూట్ యాక్షన్ తో భలేగా ఉంది అంటున్నారు చూసిన వారంతా.వీడియోలో కనిపించే ప్రతి అంశం చాలా బాగుంది అని ప్రశంసిస్తున్నారు.
మరో ఫ్యామిలీ డ్రామాను తెలుగు ప్రేక్షకులకు
మారుతి అందిస్తున్నట్టు ఈ వీడియో చూస్తే స్పష్టంగా అర్థమవుతోంది.
మారుతి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న సినిమా ప్రతిరోజూ పండగే.సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్, రాశీ ఖన్నా జంటగా నటిస్తున్నారు.అల్లు అరవింద్ సమర్పణలో యూవీ క్రియేషన్స్, జీఏ2 బ్యానర్లపై బన్నీ వాస్ నిర్మిస్తున్నారు. ఎస్. తమన్ సంగీతం సమకూరుస్తున్నారు.
ఈ చిత్రంలో విజయ కుమార్, రావు రమేష్,అజయ్,సత్యం రాజేష్,ప్రవీణ్, మురళీ శర్మ,శ్రీకాంత్ అయ్యంగార్,సత్య శ్రీనివాస్, సుభాష్,
భరత్ రెడ్డి,
గాయత్రీ భార్గవి, హరితేజ, మహేష్, మరియు
సుహాస్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. జయకుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. రామోజీ ఫిల్మ్ సిటీలో తొలి షెడ్యూల్ చాలావరకు పూర్తి అయింది.త్వరలోనే రెండో షెడ్యూల్ కోసం చిత్ర యూనిట్ అమెరికా వెళ్లనుంది అని సమాచారం.