టాలీవుడ్ లో అసిస్టెంట్ కెమెరామేన్ కెరీర్ ప్రారంభించిన ‘చిత్రం’ సినిమాతో దర్శకుడిగా మారారు తేజ.  ఆ తర్వాత నితిన్ హీరోగా ‘జయం’ సినిమాతో మంచి విజయం అందుకున్నాడు.  ఆ తర్వాత తేజ తీసిన సినిమాలు దాదాపు ఫ్లాప్ టాక్ తెచ్చుకోవడంతో కొంత కాలం సినీ పరిశ్రమకు దూరంగా ఉన్నారు.  ఆ మద్య రానా, కాజల్ జంటగా ‘నేనే రాజు..నేనే మంత్రి’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు.  ఇదే ఊపుతో కాజల్, బెల్లంకొండ శ్రీను జంటగా ‘సీత’ సినిమాతో మరో ఫ్లాప్ అందుకున్నాడు.  అయితే సినీ పరిశ్రమంలో దూకుడు స్వభావం గల వ్యక్తిగా తేజ పేరు తెచ్చుకున్నారు. 

షూటింగ్ సమయంలో పలువురు నటులపై ఆయన చేయి చేసుకుంటారని రూమర్లు కూడా ఉన్నాయి. ఆ మద్య బాలకృష్ణ హీరోగా ఎన్టీఆర్ బయోపిక్ తేజ దర్శకత్వం వహిస్తారని టాక్ వినిపించడమే కాదు..ముహూర్తం షాట్ కూడా తీశారు. కానీ అనూహ్య పరిణామాల మద్య ఆ స్థానంలోకి ప్రముఖ దర్శకులు క్రిష్ ఎంట్రీ ఇచ్చాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తేజ స్టార్ హీరోలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. స్టార్ హీరోలు కావడం అంత ఆషామాషీ విషయం కాదు. ఆత్మ - ఊపిరి అంతా నటనపైనే పెట్టి అహర్నిశలు కృషి చేసిన వారే స్టార్స్ అవుతారు.

తాను మొదటి నుంచి ఏ పనైనా ఆత్మవిశ్వాతంతో చేస్తానని..తాను అనుకున్న కథలో మార్పులకు పెద్దగా అంగీకరించని, ఆ కారణంతోనే పెద్ద హీరోల సినిమాలకు దర్శకత్వం వహించని చెప్పారు. వారసత్వంతో ఎవరూ స్టార్స్ కాలేరని అలా ఒకవేళ వచ్చినా ఎక్కువ కాలం కెరీర్ కొనసాగించలేరని అన్నారు. తమ షాట్ పూర్తయిన తరువాత సెట్లోనే ఉంటూ ఇతర నటీనటుల నటనను పరిశీలించినవారే స్టార్స్ అవుతారు. అలా స్వయంకృషితో పైకి వచ్చినవారే చిరంజీవి,అమితాబచ్చన్ లాంటి వారని అన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: