మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘సైరా’ సినిమా అదిరిపోయే హిట్ అందుకున్న విషయం అందరికీ తెలిసినదే. ఈ సినిమా విజయంతో మెగాస్టార్ అభిమానులు మరియు తెలుగు సినిమా ప్రేక్షకులు ఎంతగానో సంతోషించారు. ముఖ్యంగా మెగా అభిమానులు అయితే చాలా కాలం తర్వాత చిరంజీవి రికార్డు స్థాయిలో కలెక్షన్లు రాబడుతూ కొత్త రికార్డులు క్రియేట్ చేసిన నేపథ్యంలో దసరా పండుగ అయిపోయిన గాని దసరా ఇంక జరుపుకుంటున్నారు. అదేవిధంగా రామ్ చరణ్ నిర్మాతగా తన తండ్రి సినిమాని భారీ స్థాయిలో విడుదల చేసి మంచి హిట్ చిరంజీవి జీవితంలోనే ఇవ్వటంతో చాలామంది సినిమా ప్రేమికులు మరియు మెగా కుటుంబానికి చెందిన వాళ్లు అభిమానులు..ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు సినిమాని అద్భుతంగా నిర్మించిన చరణ్ పై ఇంకా పొగడ్తల వర్షం కురిపిస్తూనే ఉన్నారు.


అలాగే సినిమా సక్సెస్ అయిన తర్వాత ప్రమోషన్ కార్యక్రమాలు బాగా జరిగేలా చూసుకుంటూ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కి గుర్తింపు దక్కేలా ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ నేతలకు మరియు జాతీయస్థాయిలో పెద్ద పెద్ద నాయకులకు సినిమాను ప్రదర్శించడానికి చిరంజీవి అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. చిరంజీవి కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా అతి తక్కువ సమయంలోనే భారీ కలెక్షన్లు రాబట్టి టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర బీభత్సమైన రికార్డులను సృష్టించింది. దీంతో సైరా సినిమా విడుదల అయ్యి 15 రోజులు కావస్తున్న క్రమంలో ఈ సినిమా కలెక్షన్స్ లెక్కలు రోజు టాలీవుడ్ ఇండస్ట్రీలో మరియు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గానే కథలు కథలుగా చెప్పుకొంటున్నారు.


దాదాపు సినిమా రిలీజ్ అయి రెండు వారాలు కావస్తున్న క్రమంలో ఇప్పటికే 200 కోట్లు ప్రపంచవ్యాప్తంగా కలెక్ట్ చేసిన ఈ సినిమా 15వ రోజు కూడా రెండు వందల కోట్లకు పైగానే కలెక్షన్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాల నుండి వస్తున్న సమాచారం. ముఖ్యంగా ఇటీవల చిరంజీవి జగన్ తో బేటీ కావడంతో రాయలసీమ ప్రాంతంలో ఎక్కువగా జగన్ అభిమానులు కూడా ఈ సినిమా చూడటానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారట. తమ ప్రాంతానికి చెందిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం సైరా రూపంలో వెండి తెర పై ఆవిష్కరించడం తో చాలామంది రాయలసీమ ప్రాంతానికి చెందిన ప్రజలు కూడా చిరంజీవిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మొత్తంమీద చూసుకుంటే సైరా సినిమా విడుదల అయ్యి 15 రోజులు కావస్తున్న క్రమంలో దాదాపు 200 కోట్లకు పైగానే ఈ సినిమా కలెక్షన్స్ కలెక్ట్ చేసినట్లు ఫిలింనగర్ లో వినపడుతున్న టాక్.


మరింత సమాచారం తెలుసుకోండి: