ఈ మ‌ధ్య కాలంలో డైరెక్ట‌ర్లు హీరోలు అవ‌డం ఒక ఫ్యాష‌న్‌గా మారిపోయింది. ఈ నేప‌ధ్యంలోనే మీకు మాత్ర‌మే చెప్తా  అంటూ పెళ్ళిచూపులు డైరెక్ట‌ర్ త‌రుణ్ భాస్క‌ర్ హీరోగా చెయ్య‌బోతున్న విష‌యం తెలిసిందే. ఈ మూవీ ట్రైల‌ర్ మ‌రి కొద్ది గంట‌ల్లో రాబోతుంది. యూత్‌ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ అంటే ఇన్నాళ్లూ హీరోగా అల‌రించారు. కానీ ఇప్పుడు ఈయన నిర్మాతగా మారిపోయాడు. ఈ ప్రయత్నంలోనే కింగ్ ఆఫ్ ది హిల్ పేరిట నిర్మాణ సంస్థను స్థాపించి అందులో మీకు మాత్రమే చెప్తా అంటూ ఓ సినిమాను నిర్మిస్తున్నారు.   పెళ్లి చూపులు సినిమాతో తనకు బ్రేక్ ఇచ్చిన దర్శకుడు తరుణ్ భాస్కర్‌ను ఈ సినిమాతో పూర్తిస్థాయి హీరోగా మార్చేసాడు విజయ్.ఈయ‌న‌ గ‌తంలో కొన్ని చిత్రాల్లో క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా న‌టించి మంచి పేరు తెచ్చుకున్న సంగ‌తి తెలిసిందే.  కొత్త దర్శకుడు షమ్మీర్ సుల్తాన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ వీడియోకు మంచి రెస్పాన్స్ వచ్చింది.


ఇదిలా ఉంటే ఈ రోజు సాయంత్రం 6.10కి ఈ చిత్ర ట్రైల‌ర్‌ను సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు లాంచ్ చేయ‌నున్నారు. ఈ త‌రం హీరోలు కూడా ఒక‌రికొక‌రు హెల్పింగ్ నేచ‌ర్ అనేది చాలా బాగా జ‌రుగుతుంది. ఒక‌రి సినిమాను మ‌రొక‌రు ప్ర‌మోట్ చెయ్య‌డం ఇలాంటివ‌న్నీ ఈ రోజుల్లో చాలా స‌హ‌జంగా మారాయి. ఒక‌ప్పుడు కొన్ని ఇగో ఫీలింగ్స్ అనేవి ఉండేవి. కానీ ప్ర‌స్తుతం హీరోల మ‌ధ్య అలాంటివి ఏమీ లేవు. 


ఇక ఈ చిత్రం తాజాగా విడుదలైన ప్రమోషనల్ వీడియో కూడా అదిరిపోయింది. తరుణ్ భాస్కర్, విజయ్ దేవరకొండ, అభినవ్ ఇందులో కనిపించారు. టైటిల్ మీకు మాత్రమే చెప్తా అంటూ విజయ్ చేసిన కామెడీ భలేగా ఉంది. కింగ్ ఆఫ్ ది హిల్ అనే ప్రొడక్షన్ హౌజ్ మొదలుపెట్టాడు విజయ్. దీనికి ప్రత్యేకంగా అర్థం కూడా ఏం లేదు. విజయ్ దేవరకొండను ఇంగ్లీష్‌లో పెట్టేసాడంతే. దేవర అంటే కింగ్.. కొండ అంటే హిల్ అలా విజయ్ దేవరకొండ కాస్తా కింగ్ ఆఫ్ ది హిల్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో తొలి సినిమా కూడా రాబోతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: