కోలీవుడ్ స్టార్ హీరో ఇళ‌య ద‌ళ‌ప‌తి విజ‌య్ న‌టించిన బిగిల్ సినిమా దీపావ‌ళి కానుక‌గా అక్టోబ‌ర్ 26న ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌లో తెర‌కెక్కే ఈ సినిమాలో న‌య‌న‌తార హీరోయిన్‌గా న‌టిస్తోంది. అట్లీ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా తెర‌కెక్కుతోంది. గ‌తంలో అట్లీ - విజ‌య్ కాంబోలో వ‌చ్చిన తెరీ (తెలుగులో పోలీసోడు), మెర్స‌ల్ ( తెలుగులో అదిరింది) సినిమాలు రెండు సూప‌ర్ డూప‌ర్ హిట్ అయ్యాయి. దీంతో విజ‌య్ - అట్లీ కాంబినేష‌న్ అన‌గానే ఓ ముద్ర ప‌డిపోతోంది. 


ఇక ఇప్పుడు వీరి కాంబోలో వ‌స్తోన్న ఈ మూడో సినిమా కూడా సూప‌ర్ డూప‌ర్ హిట్ అవుతుంద‌ని విజ‌య్ అభిమానులు లెక్కులు వేసుకుంటున్నారు. ఈ సినిమాను తెలుగులో విజిల్ పేరుతో రిలీజ్ చేస్తున్నారు. ప్ర‌ముఖ పీఆర్వో మ‌హేష్ ఎస్ కోనేరు ఈస్ట్‌కోస్ట్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై ఈ సినిమాను ఇక్క‌డ రిలీజ్ చేస్తున్నారు.


అటు విజ‌య్ హీరో కావ‌డంతో పాటు న‌య‌న‌తార లాంటి లేడీ సూప‌ర్ స్టార్ హీరోయిన్‌గా ఉండ‌డం.. అట్లీ డైరెక్ష‌న్‌, ఏఆర్‌.రెహ్మ‌న్ మ్యూజిక్ సినిమాపై అంచ‌నాలు ఆకాశంలోకి తీసుకు వెళ్లిపోయాయి. ఈ సినిమా రు.150 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కింది. బిగిల్ థియేటర్ మరియు నాన్-థియేట్రికల్ హక్కులతో సహా రూ .222 కోట్ల వ‌ర‌ల్డ్ వైడ్ ప్రి రిలీజ్ బిజినెస్ చేసింది. ఇక రు.222 కోట్ల ప్రి రిలీజ్ అంటే టార్గెట్ మామూలుగా లేదు. మ‌రి ఈ టార్గెట్‌ను విజ‌య్ ఎలా ?  చేధిస్తాడో ?  చూడాలి. 


బిగిల్ (విజిల్) ప్రి రిలీజ్ బిజినెస్ (రూ.కోట్ల‌లో) :
తమిళనాడు - 85
కేరళ & కర్ణాటక - 16
తెలుగు - 9
ఓవ‌ర్సీస్‌ - 28
థియేట్రికల్ - 140
నాన్-థియేట్రికల్ - 82
-----------------------------------------------------
టోట‌ల్ ప్రి రిలీజ్ బిజినెస్ = రూ .222 కోట్లు
-----------------------------------------------------


మరింత సమాచారం తెలుసుకోండి: