సినిమాలను థియేటర్లలోనే చూడాలనే రోజులు పోయాయి. అమెజాన్, నెట్ ఫ్లిక్స్ వంటివి వచ్చాక జనాలు థియేటర్లకి రావడం మానేశారు. ఎప్పుడో పెద్ద హీరో సినిమా అయితే తప్ప పెద్దగా రావట్లేదు. ఎలాగో నెలరోజులు ఆగితే డిజటల్ ఫ్లాట్ ఫామ్ లో వచ్చేస్తాయి కదా అనే నమ్మకంతో సినిమా చూసేవాళ్ళు తగ్గిపోతున్నారు. సినిమాల మీద ఇంట్రెస్ట్ అయితే తగ్గలేదు. కానీ థియేటర్ లో చూడటం తగ్గించారు. 


ఇక్కడ ప్రొడ్యూసర్ల తప్పిదం కూడా ఉంది. రేటుఉ వస్తుంది కదా అని సినిమా విడుదలైన నెలరోజులలోపే డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లకి అమ్మేస్తున్నారు. దీనివల్ల బయ్యర్లు చాలా నష్టపోతున్నారు. సినిమా రిలీజైన రెండు నెలల వరకు ఏ డిజిటల్ ఫ్లాట్ ఫాంకి అమ్మకూడదనే నియమం పెట్టాలనే వాదన బలంగా వినిపిస్తోంది. ఈ విషయాలన్నీ అటుంచితే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన "సాహో" మరికొద్ది రోజుల్లో అమెజాన్ లో కనిపించనుంది.


ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బాలీవుడ్ మినహా మిగతా అన్ని చోట్ల నెగెటివ్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీసు రేసులో చతికిల పడింది. అయినా ప్రభాస్ కి ఉన్న క్రేజ్ కారణంగా ఈ సినిమాకి ప్రపంచ వ్యాప్తంగా 400 కోట్ల వరకు కలెక్షన్లు వచ్చాయి.  సాహో డిజిటల్ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ అన్ని భాషలకు కలిపి రూ.42 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది.


థియేటర్లలో రాక ముందు ప్రేక్షకులు సాహో కోసం ఎదురు చూశారో.. ఇప్పుడు సినిమాను చూడని వారు అమెజాన్ లో ఎప్పుడు వస్తుందా అంటూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు సాహో చిత్రం విడుదలకు అమెజాన్ డేట్ ను ఖరారు చేసింది. ఈ నెల 19 వతేదీన "సాహో" అమెజాన్ లో ప్రేక్షకులని పలకరించనుంది. ఒకేసారి తెలుగుతో పాటు హిందీ.. తమిళం.. కన్నడం.. మలయాళంలో విడుదల చేయబోతున్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి: