తమిళనాట స్టార్ హీరో దళపతి విజయ్ "బిగిల్" చిత్రంతో మన ముందుకు రాబోతున్నాడు. తెలుగులో దసరా కానుకగా వచ్చిన సినిమాల సందడి దాదాపుగా అయిపోయిందనే చెప్పాలి. ఈ దసరా సందడంతా సైరాదే. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అయితే సైరా తర్వాత సంక్రాంతి వరకు తెలుగులో రిలీజ్ అయ్యే పెద్ద సినిమాలేం కనిపించట్లేదు. అయితే తమిళంలో మాత్రం ఈ దీపావళికి సినిమా సందడి మొదలు కానుంది.


అయితే ఆ సందడంతా విజయ్ నటించిన బిగిల్ దే ఉండనుంది. దర్శకుడు అట్లీ- విజయ్ ల కాంబినేషన్ లో వస్తున్న ముడో చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన తెరి, మెర్సల్ చిత్రాలు బాక్సాఫీసు వద్ద మంచి కలెక్షన్లు రాబట్టాయి. అందుకే ఈ సినిమా కూడా విజయం సాధించి హ్యట్రిక్ అవుతుందనే నమ్మకంతో ఉన్నారు. స్పోర్ట్స్ డ్రామాతో సాగే ఈ సినిమాలో విజయ్ రెండు విభిన్నమైన పాత్రలలో కనిపిస్తాడట.


ఇటీవలే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం రన్ టైం 179 నిమిషాలు ఉందట. అంటే ఒక నిమిషం తక్కువ మూడు గంటలన్నమాట. రన్ టైం ఇంతసేపు ఉంటే జనాలు చూస్తారా అనే సందేహం కలుగుతుంది. ముఖ్యంగా తెలుగులో విజయ్ కి ఉన్న మార్కెట్ చాలా తక్కువ. ఆయన గత చిత్రాలు కూడా తెలుగులో పెద్దగా ఆడలేదు. అదే ఇప్పుడు తెలుగు హక్కులు కొనుక్కున నిర్మాతకి భయం పట్టుకుంది.


ఈ సినిమా తెలుగు వెర్షన్ ని నిర్మాత మహేష్ కోనేరు  విడుదల చేయనున్నాడు.  తెలుగులో మార్కెట్ లేని విజయ్ ని తెలుగు ప్రజలు అంత సేపు చూడగలరా అనే సందేహం మొదలైంది. ఇప్పటి వరకైతే రిలీజ్ తేదీని ప్రకటించలేదు. మరికొద్ది రోజుల్లో ఎప్పుడు విడుదల చేస్తారనేది ప్రకటిస్తారట. తెలుగులో ఈ సినిమా ఎలా ఆడుతుందో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: