ఈ మధ్యకాలంలో సినిమావాళ్లకు థియేట్రికల్ హక్కులతో పాటు డిజిటల్, శాటిలైట్ హక్కుల రూపంలో బాగానే వర్కౌట్ అవుతుంది. ముఖ్యంగా అమెజాన్ ప్రైమ్ వంటి డిజిటల్ ఫ్లాట్‌ఫామ్ వచ్చాకా.. సినిమా థియోటర్స్‌లో నడుస్తోన్న సినిమాలు అమెజాన్ ప్రైమ్‌లో త్వరగా రిలీజ్ అవుతుంది. ఒక రకంగా డిజిటల్ రైట్స్ రూపంలో నిర్మాతలకు బాగానే వర్కౌట్  అయినా.. డిస్ట్రిబ్యూటర్స్‌కు మాత్రం ఒక సినిమా నడుస్తుండగా ‘అమెజాన్’ ప్రైమ్‌లో విడుదల కావడం వాళ్ళ ఎంతో కొంత నష్టాన్ని తెచ్చిపెడుతోంది. 


అందుకే ఈ మధ్యకాలంలో పెద్ద సినిమాలు  రిలీజ్‌కు ముందు అమెజాన్‌తో ముందే ఒప్పందం చేసుకుంటున్నాయి. తాజాగా నాని హీరోగా నటించిన ‘గ్యాంగ్ లీడర్’ సినిమా విడుదలైన 28 రోజుల్లోనే అమెజాన్ ప్రైమ్‌లోకి  వచ్చేసింది. దీంతో అమెజాన్ ప్రైమ్ ఉన్న వాళ్లు ఆనందపడుతున్న.. సినిమాను కొన్న డిస్ట్రిబ్యూటర్స్ మాత్రం చాలా నష్టపోతున్నారు అని అర్థం అవుతుంది.


తాజాగా ప్రభాస్ హీరోగా నటించిన ‘సాహో’ మూవీ విడుదలకు ముందే అమెజాన్ ప్రైమ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సినిమా రిలీజైన 50 రోజుల తర్వాత అక్టోబర్ 19న అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ చేస్తున్నారు అని సమాచారం. ఇప్పటికే ఈ అమెజాన్‌లో ‘సాహో’ మూవీకి సంబంధించిన ప్రోమోస్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఒకేసారి నాలుగు భాషల్లో ఈ సినిమా అమెజాన్‌లో వస్తుంది అని సమాచారం ఉంది.


ఏమైనా థియేటర్స్‌లో ఈ సినిమా చూడని వారు ఈ నెల 28వరకు ఆగితే సరి. అంతకన్నా ముందు వచ్చినా.. ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మొత్తంగా చూసుకుంటే తెలుగులో రూ.15 కోట్ల నష్టం తీసుకొచ్చిన ఈ సినిమా హిందీలో మాత్రం రూ.50 కోట్ల లాభాన్ని సొంతం చేసుకుంది. ఓవరాల్‌గా రీజనల్‌ లాంగ్వేజ్‌లో కొద్దిగా నష్టాలను మిగిల్చిన ‘సాహో’ మూవీ హిందీలో మాత్రం సంచలన విషయం సాధించి ప్రభాస్ సత్తా ఏంటో చూపించుకున్నాడు.



మరింత సమాచారం తెలుసుకోండి: