టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి తెరకెక్కించిన తాజా సినిమా సైరా నరసింహారెడ్డి. తొలితరం రేనాడు ప్రాంతానికి చెందిన స్వాతంత్రోద్యమ వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాపై టాలీవుడ్ ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అత్యంత భారీ ఖర్చుతో తన కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సెకండ్ వెంచర్ గా ఈ సినిమాను ఎంతో గ్రాండ్ లెవెల్లో నిర్మించడం జరిగింది. అయితే ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా, బాక్సాఫీస్ దగ్గర కేవలం యావరేజ్ దగ్గరే ఆగిపోయింది. మెగాస్టార్ ఈ సినిమాలో అత్యద్భుతమైన పెర్ఫార్మన్స్ చేసినప్పటికీ, 

సినిమాలోని కథ మరియు కథనాలను ప్రేక్షకనాడి పట్టుకునే విధంగా తెరకెక్కించడంలో దర్శకుడు సురేందర్ రెడ్డి చాలావరకు విఫలమయ్యారని మెజారిటి ప్రేక్షకులు ఈ సినిమాకు తీర్పు ఇవ్వడం జరిగింది. మెగాస్టార్ సరసన నయనతార హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ సహా పలు ఇతర భాషలకు చెందిన నటీనటులు నటించడం జరిగింది. ఇకపోతే ప్రస్తుతం ఈ సినిమా చాలా ప్రాంతాల్లో నత్తనడకన ముందుకు సాగుతోందట. ముఖ్యంగా ఓవర్సీస్, అలానే నార్త్ ప్రాంతాల్లో ఈ సినిమాకు చాలావరకు నష్టాలు వచ్చే అవకాశం ఉన్నట్లు చెప్తున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఓవర్సీస్ లో 3.3 మిలియన్ల బిజినెస్ చేసిన ఈ సినిమా, ఇప్పటివరకు 2.5 మిలియన్లను మాత్రమే రాబట్టగలిగిందట. 

ఇక హిందీలో ఈ సినిమా హక్కులు రూ.24 కోట్లవరకు బిజినెస్ చేయగా, ఇప్పటివరకు కేవలం రూ.13 కోట్లవరకు మాత్రమే ఈ సినిమా రాబట్టిందని అంటున్నారు. అంతేకాదు మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో కూడా సైరాకు బాగానే నష్టాలు వచ్చే పరిస్థితి గట్టిగా ఉందని, ఈ విధంగా సైరా పని ఇక అయిపాయెరా అంటున్నారు పలువురు సినీ విశ్లేషకులు. మరికొద్ది రోజుల్లో క్లోసింగ్ దశకు చేరుకునే ఈ సినిమా, ఓవరాల్ గా ఎంతమేర కలెక్ట్ చేస్తుందో చూడాలి...!!


మరింత సమాచారం తెలుసుకోండి: