పవన్ వ్యక్తిత్వం గురించి అతడి మంచి తనం గురించి పవన్ అభిమానులు మాత్రమే కాకుండా బయట వ్యక్తులు కూడ అనేక విషయాలను చెపుతూ ఉంటారు. అందువల్లనే సినిమాల జయాపజయాలతో సంబంధం లేకుండా పవన్ కు వీరాభిమానులు ఉన్నారు. 

ఇలాంటి పరిస్థితులలో పవన్ స్పందించకుండానే పవన్ వీరాభిమాని కష్టం విని సహాయం చేయడానికి వచ్చిన మంచు మనోజ్ కు సంబంధించిన ఒక సంఘటన ఇప్పుడు బయట పడింది. సాయినాథ్ కళ్యాణ్ అనే వ్యక్తి పవన్ కు వీరాభిమాని వైజాగ్ ప్రాంతానికి చెందిన ఈ వ్యక్తి పవన్ రాజకీయాల ప్రవేశ సమయంలో కూడ విపరీతంగా పని చేసినట్లు తెలుస్తోంది.

ఇలాంటి పవన్ వీరాభిమానికి ఇప్పుడు ఒక అనుకోని కష్టం వచ్చింది. అతడి తండ్రి బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ కావడంతో దానిని తొలగించడానికి 10 లక్షలు ఖర్చు అవుతుందని డాక్టర్స్ చెప్పారట. ఆర్ధిక పరిస్థితి ఏమాత్రం బాగాలేని సాయినాథ్ కళ్యాణ్ ఏమి చేయాలో తెలియక తనకు ఎవరైనా సహాయం చేసి పెట్టమని తన పరిస్థితిని వివరిస్తూ ట్విట్ చేయడమే కాకుండా ఆ ట్విట్ ను పవన్ కళ్యాణ్ వి.వి. లక్ష్మినారాయణ మంచు మనోజ్ లకు ట్యాగ్ చేసినట్లు తెలుస్తోంది. 

పవన్ లక్ష్మీనారాయణలు ఈ ట్విట్ పై ఇప్పటి వరకు స్పందించక పోయినా మంచు మనోజ్ మాత్రం ఆ ట్విట్ కు సమాధానం ఇస్తూ తనకు సాయినాథ్ కళ్యాణ్ తండ్రి రిపోర్ట్స్ పంపించమని రీ ట్విట్ చేసాడు. దీనితో పవన్ అభిమానులు కూడ మంచు మనోజ్ మంచి మనసును మెచ్చుకుంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ వార్తలు ఇలా వైరల్ కావడంతో మంచు మనోజ్ పవన్ కంటే మంచితనంలో మించిపోయాడా అంటూ మరికొందరు మనోజ్ ను ఇలాంటి మంచి కార్యక్రమాలు మరిన్ని చేయమని ప్రోత్సహిస్తున్నారు.. 



మరింత సమాచారం తెలుసుకోండి: