టాలీవుడ్ లో క్రియేటీవ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు కృష్ణవంశీ. రామ్ గోపాల్ వర్మ దగ్గర కొన్నిసినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసాడు. వర్మ ముఖ్య శిష్యుల్లో కృష్ణవంశీ ఒకరు.  తన మొదటి సినిమా గులాబీతో మంచి పేరు తెచ్చుకున్నాడు. 2000వ సంవత్సరంలో ఆంధ్రా టాకీస్ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించాడు.  ఈ సినిమా టేకింగ్, పాటలు, కాన్సెప్ట్ మెచ్చిన అక్కినేని నాగార్జున, కృష్ణవంశీకి ఒక ఛాన్స్ ఇచ్చారు. వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా ‘నిన్నే పెళ్లాడుతా’. 

ఈ మూవీ నాగార్జున కెరీర్ లో ఓ బిగ్గెస్ట్ హిట్ సినిమా అని చెప్పొచ్చు.  మంచి ప్రేమ కథే కాదు..మంచి కుటుంబం, స్నేహ బంధాలను ఈ మూవీలో చూపించారు. ఈ మూవీతో తెలుగులో టబు కి కూడా మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత నక్సల్  కథా నేపథ్యంలో ‘సింధూరం’ అనే సినిమా తీశారు.  ఈ మూవీ  విమర్శకుల ప్రశంసలు పొందినా..ఆర్థికంగా నష్టపరిచింది.  కృష్ణవంశి డైరెక్షన్లో దేశ భక్తి మూవీగా ‘ఖడ్గం’ అఖండ విజయం అందుకుంది. గత కొంత కాలంగా కృష్ణ వంశీ తీస్తున్న ఏ సినిమా కూడా సక్సెస్ కాలేదు. ఆయన చివరి మూవీ ‘నక్షత్రం’.  ఈ నేపథ్యంలో కొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు కొద్ది రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో  బుధ‌వారం త‌న త‌దుప‌రి ప్రాజెక్ట్‌పై క్లారిటీ ఇచ్చారు ఈ క్రియేటివ్ డైరెక్ట‌ర్‌. నటసామ్రాట్ అనే మరాఠీ సూపర్ హిట్ సినిమాను తెలుగులో రీమేక్ గా చేయబోతుండ‌గా, ఈ సినిమాకి తెలుగులో ‘రంగమార్తాండ’ అని టైటిల్ ను పెట్టారు. ఒరిజినల్ వెర్షన్ లో నానా పటేకర్ పోషించిన పాత్రను తెలుగు రీమేక్‌లో ప్రకాష్ రాజ్ చేస్తుండగా ఆయ‌న సరసన రమ్యకృష్ణ నటిస్తోంది. అవికాగోర్ ముఖ్య పాత్ర‌లో క‌నిపించ‌నున్న‌ట్టు స‌మాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: