విజయ్ దేవరకొండ బాడీ లాంగ్వేజ్ మాత్రమే కాకుండా అతడి మాటతీరు కూడా చాల విభిన్నంగా ఉంటుంది. దీనితో అతడికి ఇగో ఎక్కువ అన్న ప్రచారం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితులలో నిన్న విజయ్ ఒక హాలీవుడ్ మూవీ తెలుగు డబ్బింగ్ ట్రైలర్ ను ఆవిష్కరిస్తూ చేసిన కామెంట్స్ మీడియాకు కూడ షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. 

వచ్చేనల నవంబర్ 1న టెర్మినేటర్ సిరీస్‌లోని ‘టెర్మినేటర్ డార్క్ ఫేట్’ సినిమాను తెలుగులోకి అనువాదం చేసి విడుదల చేస్తున్నారు. ఆర్నాల్డ్ స్క్వార్జ్‌నెగ్గర్ హీరోగా  నటిస్తున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ తాను. స్కూల్‌లో చదుకునే రోజుల్లో ‘టెర్మినేటర్ 2: జడ్జిమెంట్ డే’ సినిమా చూశానని అప్పట్లో ఆ సినిమాను బాగా ఎంజాయ్ చేశామని వెల్లడించాడు.

అయితే ఒకప్పుడు హాలీవుడ్ సినిమాలను తెలుగు డబ్బింగ్ చూస్తే ఇరిటేషన్ వచ్చేదని అయితే ఇప్పుడు పరిస్థితి మారి డబ్బింగ్ క్వాలిటీ చాలా బాగా పెరిగి హాలీవుడ్ సినిమాలను తెలుగులో చూడాలని  అనిపిస్తోంది అంటూ కామెంట్ చేసాడు. ఇదే సందర్భంలో మరొక ట్విస్ట్ ఇస్తూ తెలుగు సినిమాలు కూడ హాలీవుడ్ రేంజ్ లో తీస్తున్నారని చెపుతూ హాలీవుడ్ కు తెలుగు సినిమాలు ఏమాత్రం తీసిపోవు అంటూ కామెంట్ చేసాడు.

ఈ సందర్భంలో ఈ మీడియా మీట్ ను కవర్ చేయడానికి వచ్చినఒక మీడియా ప్రతినిధి విజయ్ ను ఇరుకున పెట్టడానికి ఒక ఆసక్తికర ప్రశ్న వేసాడు. హాలీవుడ్ సినిమాలలో కూడ నటించ వచ్చు కదా అంటూ ఆ మీడియా ప్రతినిధి అడగగానే విజయ్ షాకింగ్ సమాధానం ఇచ్చాడు. ‘నేను ప్రభాస్ అన్నాను కాను అలాంటి ప్రయోగాలు ప్రభాస్ కు చెల్లుతాయి’ అంటూ జోక్ చేసాడు. అయితే ఇక్కడ మరొక షాకింగ్ సమాధానం ఇస్తూ త్వరలో ఆర్నాల్డ్ స్వ్కార్జ్‌నెగ్గర్ తన ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమా గురించి మాట్లాడే రోజులు వస్తాయని అంటూ మరొకసారి విజయ్ తన ఇగో ను బయటపెట్టాడు..  



మరింత సమాచారం తెలుసుకోండి: