ఇదివరకు ఒక సినిమా నటుడి కెరీర్ మూడు నాలుగు దశాబ్దల పాటు సాఫీగా హ్యాపీగా సాగిపోయేది. నాడు బడ్జెట్  తక్కువ, నష్టాలు కూడా చాలా తక్కువ. ఆడియన్స్ ఆకాంక్షలు  కూడా ఇంకా తక్కువ. ఎందుకంటే నాడు వినోదం అంటే కేవలం సినిమా మాత్రమే. ఇపుడు అలా కాదు తెర మీద బొమ్మకు ఎన్నో కత్తెరలు వచ్చేశాయి. సినిమా హలులో సినిమా చూసే వారూ తగ్గిపోయారు. వారిని ఇంటికి నుంచి సినిమా హాలుకు రప్పించాలంటే బ్రహ్మ‌ప్రయత్నమే అవుతోంది


ఈ దశలో  నేలబారుడు కధలు, కధనాలతో సినిమాలు ఎవరైనా తీస్తే వారికి ఫ్యూచర్ ఉండదు రెండవ సినిమా అన్న చాన్సే లేదు. ఇక టాలీవుడ్లో సీనియర్ల నుంచి అందరిదీ ఇదే రకమైన పరిస్థితి. ఇవన్నీ ఇలా ఉంటే సీనియర్ హీరో నాగర్జున గత మూడేళ్ళుగా ఒక్క హిట్ కొట్టలేక చతికిలపడుతున్నారు.ఆయనకు 2014లో మనం మూవీ పెద్ద హిట్ గా వచ్చింది. 2016లో సోగ్గాడే చిన్న నాయన మరో హిట్ అయింది అంతే ఆ తరువాత నుంచి నాగ్ కెరీర్ ముందుకు సాగడంలేదు. రాం గోపాల్ వర్మతో చెసిన ఆఫీసర్ భారీ డిజాస్టర్ అయింది. ఇక వరసగా మూవీస్ ఫట్ అవుతూ ఇపుడు మన్మ‌ధుడు 2 మూవీ కూడా డిజాస్టర్ కావడంతో నాగ్ షాక్ తిన్నాడట.


అయితే వెంటనే తేరుకున్న ఈ సీనియ‌ర్ హీరో ఇపుదు వరసగా మరో మూడు సినిమాలను పట్టాలక్కించే పనిలో పడ్డాడట . నాగ్ లేటెస్ట్ గా కొత్త డైరెక్టర్ తో ఓ మూవీకి కమిట్ అయ్యాడని టాక్. ఆ మూవీని ఆయన సొంత బ్యానర్ మీద తీస్తున్నాడట. అదే విధంగా హిందీలో హిట్ అయిన రైడ్ మూవీని కూడా తెలుగులో రీమేక్ చేసేందుకు నాగ్ రెడీ అవుతున్నాడట. ఇక మరో మూవీ కూడా లైన్లో ఉందిట. ఈసారి ఎటువంటి పొరపాట్లు లేకుండా చూసుకుని బ్లాక్ బ‌స్టర్ హిట్ ఇవ్వాలని నాగ్ డిసైడ్ అయ్యాడట. మరి చూడాలి. నాగ్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటారు కదా.


మరింత సమాచారం తెలుసుకోండి:

nag