లక్ష్మి కల్యాణంతో కాజల్‌అగర్వాల్‌  సినిమా ఇండస్ట్రీకి వచ్చి 12 ఏళ్లు అయ్యుంది.. ఈ సందర్భంగా కాజల్‌ అగర్వాల్ ఇటీవల మీడియాతో తన అనుభవాలను పంచుకున్నారు. హింది, తెలుగు, తమిళం వంటి అనేక భాషలో ఆమె నటించి, మెప్పించారు. ఇప్పటికి హీరోయిన్‌గా కొనసాగుతూ, ఇంకా చెప్పాలంటే కొంచెంకూడా క్రేజ్‌ తగ్గని నటిగా రాణిస్తున్నారు కాజల్. సినిమాలో తన అనుభవం చాలా  అందమయినది అని, పర్శనల్‌గానూ.... అటు కేరీర్‌ పరంగా తాను చాలానే నేర్చుకున్నాను అని, ఇంకా చాలా నేర్చుకోవాలి అని చెప్పుకొచ్చారు.


తాను ముంబై అమ్మాయి అయినా ఎక్కువ తమిళనాడు, హైదరాబాద్‌లలోనే  నివసిస్తుండడంతో తనకు  తెలియకుండానే నేను దక్షిణాది అమ్మాయిగా మారిపోయాను అని చెప్తున్నారు. తన ఇన్‌స్ట్రాగామ్‌లో కూడా ఎప్పుడు, పోస్ట్‌లతో సోషల్ మీడియాలో ఫాన్స్ కి చేరువగా ఉంటూ తన లైఫ్ కి, కెరీర్ కి సంబందించిన విషయాలన్నీ అభిమానులతో పంచుకుంటూ ఉంటారు కాజల్ అగర్వాల్. ఈమధ్య కాజల్ అగర్వాల్‌కి పెళ్లిపై గాలి మళ్లీందా అనే పుకార్లు వస్తుండటంతో దానిపైన కాజల్ స్పందించింది. 

తన చెల్లెలు నిషా అగర్వాల్ పెళ్లి చేసుకుని, ఒక బాబుతో అందమయిన కుటుంబ జీవితం గడపటం చూసి తనకి కూడా అలాంటి  లైఫ్ కావాలని ఊహలు ఏమైనా వస్తున్నాయా అంటూ ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే రీసెంట్‌గా  తన ఇంటర్వ్యూ లో కాజల్ తనకు, వివాహ వ్యవస్థపై నాకు చాలా విశ్వాసం, నమ్మకం ఉన్నాయి అని అందుకు వాళ్ళ  అమ్మనాన్నలే ఉదాహరణ అని, పెళ్లి అయి ఇంతకాలం అయినా, ఇప్పటికీ  వాళ్ళు చాలా అన్యోన్యమైన జీవితాన్ని గడుపుతున్నారు అన్నది. ఈ విషయంలో వారే నాకు ఆదర్శం అని  చెప్పుకొచ్చారు.


తనకు  నచ్చిన వ్యక్తి తారసపడితే వెంటనే పెళ్లి చేసుకుంటాను అని చెప్పారు. తనకు కాబోయే భర్త గురించి కాజల్ ఇలా చెప్పుకొచ్చింది. నిజాయితీపరుడై వుండాలి, అందరినీ గౌరవించే సంస్కారం వుండాలి. అందగాడుగా,ఆజానుబాహుడు అవసరం లేదు, తాను అందం గురించి ఎప్పుడు అంత ప్రాధాన్యత ఇవ్వను అని పేర్కొన్నారు. కాబోయే వాడు ఎలా ఉండాలో ఫుల్ క్లారిటీ ఇచ్చేసారు  కాజల్. ఇక పోతే డేటింగ్ మీద తనకున్న అభిప్రాయం ఏంటి అని అడగగా, డేటింగ్ అనే కాన్సెప్ట్‌కు తాను పూర్తి వ్యతిరేకమని చెప్పారు కాజల్ అగర్వాల్‌.


మరింత సమాచారం తెలుసుకోండి: