సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన  లేటెస్ట్ మూవీ మహర్షి  ఈఏడాది సమ్మర్ లో విడుదలై  100కోట్ల వసూళ్లతో  సూపర్ హిట్ అనిపించుకుంది.  ఇక స్టార్ హీరోయిన్ సమంత  ప్రధాన పాత్రలో నటించిన లేడీ ఓరియెంటెడ్ మూవీ  ఓ బేబీ కూడా ఇటీవల విడుదలై  40కోట్ల గ్రాస్ వసూళ్లతో సూపర్ హిట్ అనిపించుకుంది. తాజాగా ఈ రెండు చిత్రాలు  బుల్లితెర పై పోటీ పడ్డాయి. దసరా కానుకగా ఈనెల 6న  మహర్షి  ప్రీమియర్ జెమినీ టీవి లో ప్రసారం కాగా  ఓ బేబీ కూడా అదేరోజు స్టార్ మాలో  ప్రసారం అయ్యింది. ఇక ఈ రెండు చిత్రాలు  దాదాపుగా  సమానమైన  టీఆర్పీ రేటింగ్స్ ను సాధించడం విశేషం. 



మహర్షి 9.2 టీఆర్పీ రేటింగ్స్ ను రాబట్టి నిరాశపరచగా ఓబేబీ 9టీఆర్పీ రేటింగ్స్ ను సాధించింది. ఈరెండు సినిమాలు   దాదాపు  ఒకే సమయంలో  ప్రసారం కావడంతో  మహర్షి  ఆశించిన స్థాయిలో రేటింగ్స్ ను రాబట్టలేకపోయింది.  ఇక  డిజిటల్ స్క్రీనింగ్ విషయానికి వస్తే మహర్షి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుండగా  ఓ బేబీ నెట్ ఫ్లిక్స్ లో  స్ట్రీమ్  అవుతుంది. ఇదిలా  ఉంటే ప్రస్తుతం మహేష్  అనిల్ రావిపూడి డైరెక్షన్ లో  సరిలేరు నీకెవ్వరు లో నటిస్తూ బిజీగా ఉండగా  కొద్దీ రోజుల క్రితం 96తెలుగు రీమేక్ ను షూటింగ్ ను పూర్తి చేసిన  సమంత ప్రస్తుతం చేతిలో  సినిమాలు లేక ఖాళీగా వుంది. అయితే అవకాశాలు లేక  సమంత ఖాళీగా లేదు. ఆఫర్లు వస్తున్న కానీ  ఎందుకనో ఓ బేబీ తరువాత ఇంతవరకు ఆమె  మరో  సినిమాకు సైన్ చేయలేదు.అయితే  ఫిలిం నగర్ వర్గాల నుండి వస్తున్న సమాచారం ప్రకారం  ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 వెబ్ సిరీస్లో సమంత నెగిటివ్ పాత్రలో నటించడానికి ఓకే చెప్పిందట. 


మరింత సమాచారం తెలుసుకోండి: